News January 26, 2025

కడపలో వైసీపీ, జనసేన ఫ్లెక్సీల కలకలం

image

కడప ఆర్ట్స్ కాలేజీ వద్ద YSRCP, జనసేన ఫ్లెక్సీలు హాట్ టాపిక్‌గా మారాయి. అధికారం ఉన్నా లేకపోయినా, ఎవరు వెళ్లిపోయినా కార్యకర్తలంతా జగన్ వెంటే ఉంటామని ఆ పార్టీ వారు ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇక మరో ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్ 50 కాకుండా 21 సీట్లే తీసుకుని నష్టపోయారని జనసేన పేరిట ఫ్లెక్సీలు వెలిశాయి. పవన్‌ను వదిలేసి టీడీపీ నేతలు దావోస్ వెళ్లారంటూ అందులో విమర్శలున్నాయి. వీటిపై స్థానికంగా చర్చ నడుస్తోంది.

Similar News

News January 28, 2025

భారత్-చైనా కీలక నిర్ణయం

image

మానస సరోవర్ యాత్రను పున:ప్రారంభించాలని భారత్, చైనా కలిసి నిర్ణయించాయి. ఇందుకోసం ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు నడపాలని అంగీకరించాయి. ఈ మేరకు భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, చైనా విదేశాంగ ఉప మంత్రి సన్ వెయ్‌డాంగ్‌ భేటీ అయ్యారు. అంతర్జాతీయ నదులు, జల వనరులకు సంబంధించి డేటాను ఇచ్చిపుచ్చుకునేందుకు నిర్ణయించుకున్నాయి. కాగా కొవిడ్-19 కారణంగా మానస సరోవర్ యాత్రను 2020లో నిలిపివేశారు.

News January 28, 2025

ఫోన్ ఆపరేటింగ్ నేర్చుకున్న కేసీఆర్

image

TG: మాజీ సీఎం కేసీఆర్ సొంతంగా ఫోన్ వాడుతున్నారు. సీఎంగా ఉన్నన్ని రోజులు ఆయన ఫోన్ ఉపయోగించలేదు. కుటుంబసభ్యులు, నేతలు, సిబ్బంది ఫోన్లతోనే ఆయన ఇతరులతో మాట్లాడేవారు. ఇప్పుడు ఆయనకు కేటీఆర్ తనయుడు, తన మనవడు హిమాన్ష్ ఫోన్ ఆపరేట్ చేయడం నేర్పించారు. కేటీఆర్, హరీశ్, కవితతోపాటు పార్టీ ముఖ్య నేతలు, సన్నిహితుల ఫోన్ నంబర్లను సేవ్ చేసుకున్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు.

News January 28, 2025

టెన్త్ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్

image

AP: పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సెలవుల్లోనూ వారికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 2 నుంచి మార్చి 10 వరకు విద్యార్థులకు భోజనం అందించాలని విద్యాశాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 10 వరకు రెండు రెండో శనివారాలు, ఆరు ఆదివారాలు ఉన్నాయి. ఆ రోజుల్లో విద్యార్థులకు భోజనం అందించాలని ఇప్పటికే ఉత్తర్వులు వెలువడ్డాయి.