News January 26, 2025
అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో జెండా ఎగురవేసిన కలెక్టర్

అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లాస్థాయిలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ విజయకృష్ణన్ జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ తుహీన్ సిన్హా, జాయింట్ కలెక్టర్ జాహ్నవి, రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Similar News
News September 15, 2025
పెద్ద గంట్యాడలో ఉచిత శిక్షణ

ఏపీ ప్రభుత్వం స్థాపించిన నేక్ ఆధ్వర్యంలో బ్రాడ్ బాండ్ టెక్నీషియన్ కోర్స్‌లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్ సోమవారం తెలిపారు. పదవ తరగతి పూర్తి చేసి 18-40 సంవత్సరాలలోపు ఎస్సీ కులాలకు చెందిన యువత అర్హులన్నారు. 3 నెలల శిక్షణ అనంతరం ప్రైవేట్ సెక్టార్లో ఉపాధి కల్పిస్తారన్నారు. పెద్ద గంట్యాడ నేక్ సెంటర్లో శిక్షణ అందిస్తామని తెలిపారు.
News September 15, 2025
కుమారుడి మరణాన్ని తట్టుకోలేక తల్లి మృతి

కుమారుడి మరణాన్ని తట్టుకోలేక తల్లి మృతి చెందిన ఘటన చింతలపూడి మండలం గురుభట్లగూడెంలో చోటుచేసుకుంది. కుమారుడు చక్రపు వాసు నిన్న అనారోగ్యంతో మృతి చెందడంతో తల్లి శాంతమ్మ (90) మనోవేదనకు గురయ్యారు. ఈ విషాదాన్ని భరించలేక సోమవారం ఆమె తుదిశ్వాస విడిచారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకొన్నాయి.
News September 15, 2025
SRCL: ‘గ్యాస్ స్టవ్ పైనే విద్యార్థులకు ఆహారం వండాలి’

గ్యాస్ స్టవ్ పైనే విద్యార్థులకు ఆహార పదార్థాలను సిద్ధం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వేములవాడ మండలం చింతల్ఠాణా ఆర్&ఆర్ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పూర్తి చేసిన కిచెన్ షెడ్, విద్యాలయ ఆవరణను ఈ సందర్భంగా ఆయన పరిశీలించారు. విద్యాలయ ఆవరణలో నీరు నిలవకుండా, పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బిందికి సూచించారు.