News January 26, 2025
స్టాళ్లను సందర్శించిన జనగామ కలెక్టర్

జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచలో గల మినీ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోలీస్, వైద్య, గ్రామీణాభివృద్ధి, ఉద్యానవన, చేనేత, జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ, పేదరిక నిర్మూలన శాఖ, మెప్మా, తదితర శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ లను జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, డీసీపీ, ఏఎస్పీ సందర్శించి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమ వివరాలను అడిగి తెలుసుకొని వారిని అభినందించారు.
Similar News
News September 16, 2025
క్రమంగా తగ్గుతున్న నిరుద్యోగ రేటు

దేశంలో 15 ఏళ్లు, అంతకన్న ఎక్కువ వయసుండి పనిచేసే అవకాశం ఉన్న వ్యక్తుల్లో నిరుద్యోగ రేటు క్రమంగా తగ్గుతోంది. కేంద్రం విడుదల చేసిన కార్మిక సర్వే గణాంకాల ప్రకారం.. ఆగస్టులో నిరుద్యోగ రేటు 5.1%గా నమోదైంది. ఇది జులైలో 5.2 శాతంగా, మే, జూన్ నెలల్లో 5.6 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ రేటు వరసగా మూడో నెలలో కూడా తగ్గింది. మేలో 5.1% ఉన్న రేటు ఆగస్టులో 4.3 శాతానికి తగ్గింది.
News September 16, 2025
జిల్లాలో ఏడు మండలాల ఎంపీడీవోలు బదిలీలు

నెల్లూరు జిల్లాలోని 7 మండలాల్లో ఎంపీడీవోలు బదిలీ చేస్తూ జిల్లా ప్రజా పరిషత్ సీఈవో జే మోహన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ఉదయగిరి శ్రీనివాసులు, దుత్తలూరు చెంచమ్మ, నెల్లూరు రూరల్ ఎంవీ రవణమ్మ, చేజర్ల ఎలిషా బాబు, సైదాపురం ఎంవీ రామ్మోహన్ రెడ్డి, కలువాయి ఏ శైలజ, వరికుంటపాడు డీవీ రమణారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
News September 16, 2025
బందీలను వదిలేయండి.. హమాస్‌కు ట్రంప్ వార్నింగ్

హమాస్ నాయకులను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ‘ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కొనేందుకు బందీలను మానవ కవచాలుగా వాడేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. హమాస్ నేతలు ఏం చేస్తున్నారో వారికి అర్థమవుతోందా? ఇది మహా దారుణం. అతి తక్కువ మంది అలాంటివి చూసుంటారు. అలా జరగకుండా ఆపండి. లేదంటే అన్నీ ఒప్పందాలు రద్దవుతాయి. బందీలను వెంటనే విడుదల చేయండి’ అని వార్నింగ్ ఇచ్చారు.