News January 26, 2025
అదరగొట్టిన భారత బౌలర్లు

ఐసీసీ U19 ఉమెన్స్ వరల్డ్ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచులో భారత బౌలర్లు అదరగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 64/8కే పరిమితమైంది. ఆ జట్టు ప్లేయర్లలో సుమియా (21) టాప్ స్కోరర్‌గా నిలిచారు. భారత బౌలర్లలో వైష్ణవి 3 వికెట్లు పడగొట్టగా, షబ్నమ్, జోషిత, త్రిష తలో వికెట్ తీశారు. భారత్ గెలవాలంటే 20 ఓవర్లలో 65 పరుగులు చేయాలి.
Similar News
News March 13, 2025
TODAY HEADLINES

* తల్లికి వందనం పథకంలో ఎలాంటి నిబంధనలు లేవు: చంద్రబాబు
* ఏడాదిలోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చాం: రేవంత్
* రేవంత్‌ను మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి: KTR
* ఉపాధ్యాయులపై కేసులు ఎత్తివేస్తాం: లోకేశ్
* బెయిల్ రాకపోతే ఆత్మహత్యే శరణం: పోసాని
* ఈనెల 14న హైదరాబాద్‌లో మద్యం షాపులు బంద్
* అసెంబ్లీ సమావేశాలకు హాజరైన KCR
* భారత మాజీ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ కన్నుమూత
* మారిషస్ అత్యున్నత పురస్కారం అందుకున్న మోదీ
News March 13, 2025
పుష్ప 2 తొక్కిసలాట: ప్రస్తుతం శ్రీతేజ్ ఎలా ఉన్నాడంటే..

హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద పుష్ప2 రిలీజ్ రోజు తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ వెంటిలేటర్ లేకుండా శ్వాస తీసుకుంటున్నాడు. కానీ నాడీ వ్యవస్థ దెబ్బతిని మాటలు అర్థం చేసుకోలేక, కుటుంబీకులను గుర్తించలేకపోతున్నాడు. స్పర్శ కూడా తెలియడం లేదని డాక్టర్లు చెప్పారని BBC కథనంలో పేర్కొంది. నేరుగా పొట్టలోకి ట్యూబ్ అమర్చే ఎండోస్కోపిక్ గ్యాస్ట్రోస్ట్రోమీ ప్రక్రియతో ఆస్పత్రి సిబ్బంది ఆహారం పంపిస్తున్నారు.
News March 13, 2025
HMDA పరిధి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు

TG: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(HMDA) పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా 3వేల చ.కి.మీ భూభాగం చేర్చుతున్నట్లు పేర్కొంది. దీంతో మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్, నల్గొండలోని 16 మండలాలు విలీనం కానున్నాయి. ప్రస్తుతం HMDA పరిధిలో 11 జిల్లాలు, 104 మండలాలు, 1350 గ్రామాలు ఉన్నాయి.