News January 26, 2025
మేడ్చల్: 34,719 రేషన్ కార్డులకు సభల్లో ఆమోదం!

మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో ప్రత్యేక గ్రామ, వార్డు సభలు ఇటీవల నిర్వహించిన అనంతరం తాజాగా రిపోర్టు వెల్లడైంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం రేషన్ కార్డులు కావాలని దరఖాస్తు చేసుకున్న 34,719 మంది వివరాలను గ్రామ, వార్డు సభల్లో ఉంచారు. అనంతరం ఆమోదం సైతం తీసుకున్నట్లుగా అధికారులు తెలిపారు. మరోవైపు అదే సభల్లో మరి కొంతమంది దరఖాస్తు చేసుకున్నారు.
Similar News
News December 9, 2025
ఆసిఫాబాద్: ఈరోజు సాయంత్రం నుంచి మైకులు బంద్

ఆసిఫాబాద్ జిల్లా జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్, కెరమెరి, వాంకిడి మండలాల్లోని 114 పంచాయతీలకు మొదటి విడతలో భాగంగా 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం గడువు నేటి సాయంత్రంతో ముగియనుంది. దీంతో అభ్యర్థులు, వారి బంధువులు గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ తమకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఎక్కడా సమయం వృథా చేయకుండా ప్రతి ఓటరును కలుస్తూ క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
News December 9, 2025
సంగారెడ్డి: ఈ తేదీల్లో పాఠశాలలకు సెలవు: కలెక్టర్

సంగారెడ్డి జిల్లాలో జరుగనున్న పంచాయతీ ఎన్నికల సందర్భంగా విద్యా సంస్థలకు స్థానిక సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు జరగనున్నందున 11, 14, 17 తేదీలలో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యాసంస్థలకు స్థానిక సెలవు ఇవ్వాలని అన్నారు.
News December 9, 2025
తూ.గో: ఆరుగురు ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం అసంతృప్తి

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పచ్చజెండా రెపరెపలాడుతున్నా.. కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై CM చంద్రబాబు తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. వారి పనితీరుపై ఇంటిలిజెన్స్ నివేదికల ద్వారా సీఎం నిరంతరం సమాచారం సేకరిస్తున్నారని సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా మార్కులు తగ్గిన 37 మంది ఎమ్మెల్యేల జాబితాలో ఆరుగురు ఉమ్మడి జిల్లా నుంచే ఉండటం చర్చనీయాంశంగా మారింది.


