News January 26, 2025

జగిత్యాల: కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గణతంత్ర వేడుకలు

image

జగిత్యాల జిల్లాలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ బి. ఎస్. లత ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించి పతాకవిష్కరణ చేశారు. అనంతరం స్వీట్లు పంపిణి చేసి ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలు విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News January 14, 2026

ప్యాసింజర్ వెహికల్స్‌కు పెరుగుతున్న డిమాండ్

image

కార్లు, ఆటోలు వంటి ప్యాసింజర్ వెహికల్స్‌కు ఏటా డిమాండ్ పెరుగుతోంది. గతంతో పోలిస్తే 2025 DECలో కంపెనీల నుంచి డీలర్లకు సరఫరా అయిన వాహనాలు 27% పెరిగాయని SIAM పేర్కొంది. ‘ప్యాసింజర్ వెహికల్స్ గతనెలలో 3,99,216 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2024 DECతో పోలిస్తే 26.8% ఇవి అధికం. టూవీలర్స్‌ డిస్పాచ్ కూడా 39% పెరిగింది. 2025 DECలో ఇవి 15,41,036 యూనిట్లు సరఫరా కాగా 2024 ఇదే నెలలో 11,05,565 వెళ్లాయి’ అని తెలిపింది.

News January 14, 2026

ADB: డీసీసీ – కంది వర్గాల మధ్య కుదరని సయోధ్య!

image

జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య సయోధ్య కుదరడం లేదనడానికి ఇటీవల జరుగుతున్న కార్యక్రమాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ నియామకం తర్వాత కొత్త పాత నేతల మధ్య నెలకొన్న విభేదాలు సమసిపోతాయని పార్టీ శ్రేణులు అనుకున్నారు. కానీ ఇటీవల డీసీసీ చేపట్టే కార్యక్రమాల్లో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి, ఆయన చేపట్టే కార్యక్రమాల్లో నరేష్ జాదవ్ పాల్గొనకపోవడం జిల్లాలో చర్చకు దారితీసింది.

News January 14, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.