News January 26, 2025
చెన్నూర్: ప్రత్యేక వేషధారణలో చిన్నారి

రిపబ్లిక్ డే సందర్బంగా చెన్నూర్ మండలం గొల్లగూడెం MPPSలో నాల్గో తరగతి చదువుతున్న ఆర్యంత వేషధారణ ఆకట్టుకుంది. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఆటలు, పాటలు, చిన్నారుల వేషధారణలు అందరినీ అలరించాయి. చిన్నారి ఆర్యంత చీరకట్టులో ఒక చేతిలో మొక్కజొన్న కంకి, మరోచేతిలో బతుకమ్మతో వచ్చి ప్రత్యేకంగా నిలిచింది. ఆమెను చూసి పలువురు తెలంగాణ తల్లే వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News November 13, 2025
పాకిస్థాన్‌తో సిరీస్ కొనసాగుతుంది: శ్రీలంక

ఇస్లామాబాద్‌లో పేలుడు నేపథ్యంలో పలువురు శ్రీలంక ప్లేయర్లు పాకిస్థాన్ వీడుతారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్ కొనసాగుతుందని శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటన జారీ చేసింది. ప్లేయర్లు, సిబ్బందికి తగిన భద్రతను పాక్ కల్పిస్తుందని స్పష్టం చేసింది. ఎవరైనా జట్టును వీడితే వారి స్థానంలో ఇతర ప్లేయర్లను రీప్లేస్ చేస్తామని పేర్కొంది. ఇవాళ పాక్-శ్రీలంక మధ్య రెండో వన్డే జరగనుంది.
News November 13, 2025
పెద్దపల్లి: పారామెడికల్ కోర్సులు ప్రవేశానికి దరఖాస్తులు

సింగరేణి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ RGMలో పారామెడికల్ కోర్సుల దరఖాస్తు గడువు నవంబర్ 27 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ నరేందర్ తెలిపారు. డీఎంఎల్టీ, డయాలసిస్ టెక్నాలజీ కోర్సుల్లో చెరో 30 సీట్లు ఉన్నట్లు చెప్పారు. బైపీసీ విద్యార్థులు అర్హులన్నారు. సీట్లు ఖాళీగా ఉంటే ఎంపీసీ విద్యార్థులకు అవకాశం ఉంటుందన్నారు. వివరాలకు https://tgpmb.telangana.gov.in వెబ్‌సైట్ సందర్శించాలని పేర్కొన్నారు.
News November 13, 2025
మందు బాబులకు కర్నూలు ఎస్పీ హెచ్చరిక

కర్నూలు జిల్లాలో బహిరంగంగా మద్యం తాగి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. రోడ్లు, నడక దారులు, పార్కులు, వ్యాపార సముదాయాల వద్ద ప్రజా జీవనానికి ఆటంకం కలిగించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాశాంతికి భంగం కలిగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.


