News March 18, 2024
జగిత్యాలలో తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టిన మోదీ

ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత తెలంగాణలో తొలిసారి నిర్వహిస్తున్న జగిత్యాల సభ ద్వారా.. కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ప్రధాని మోదీ ఎన్నికల శంఖాన్ని పూరించారు. ‘నా తెలంగాణ కుటుంబసభ్యులందరికీ నమస్కారాలు’ అంటూ తెలుగులో ప్రసంగాన్ని మొదలు పెట్టారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి హెలిక్టాప్టర్లో జగిత్యాల చేరుకున్న మోదీకి పార్టీనాయకుల నుంచి ఘనస్వాగతం లభించింది.
Similar News
News April 17, 2025
కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత ఇలా..

కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర మండలంలో 41.0°C నమోదు కాగా, రామడుగు 40.9, జమ్మికుంట 40.8, మానకొండూర్ 40.7, చిగురుమామిడి, తిమ్మాపూర్ 40.3, చొప్పదండి, కరీంనగర్ రూరల్ 40.2, కరీంనగర్, గన్నేరువరం 40.0, శంకరపట్నం, కొత్తపల్లి 39.9, వీణవంక 39.3, హుజూరాబాద్ 38.7, ఇల్లందకుంట 38.6, సైదాపూర్ 38.1°C గా నమోదైంది.
News April 17, 2025
KNR: భూభారతి రెవెన్యూ చట్టంపై అవగాహన సదస్సులు

భూభారతి నూతన రెవెన్యూ చట్టంపై ప్రజలకు ఈనెల 17 నుంచి 30వ తేదీ వరకు కరీంనగర్ జిల్లాలోని అన్ని మండలాల్లో అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు.17న తిమ్మాపూర్, గన్నేరువరం, 19న హుజురాబాద్, 22న రామడుగు, గంగాధర, 23న చొప్పదండి, 24న మానకొండూర్, శంకరపట్నం, 25న జమ్మికుంట, ఇల్లందకుంట, 26న కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, 29న చిగురుమామిడి, సైదాపూర్, 30న వీణవంక మండలాల్లో సదస్సులు నిర్వహించనున్నారు.
News April 17, 2025
ఇల్లందకుంట జాతర బ్రహ్మోత్సవాల హుండీ లెక్కింపు

ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిన్నటితో ముగిసాయని ఈఓ సుధాకర్ తెలిపారు. బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 4 నుండి 16 ఏప్రిల్ వరకు వైభోపేతంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు సమర్పించిన కానుకల హుండీలను దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో 22 ఏప్రిల్ 2025న ఉదయం 9గంటలకు లెక్కించనున్నట్లు తెలిపారు. హుండీ లెక్కింపులో పాల్గొనే భక్తులు డ్రెస్ కోడ్‌లో రావాలని సూచించారు.