News January 26, 2025
సంక్షేమ పథకాలను ప్రారంభించిన వేం నరేందర్ రెడ్డి

నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 4 సంక్షేమ పథకాలను మండలంలోని గాంధీనగర్‌లో వేం నరేందర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మురళి నాయక్, ఎంపీ బలరాం నాయక్ ప్రారంభించారు. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, మార్కెట్ ఛైర్మన్ సంజీవరెడ్డి, సంబంధిత అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
Similar News
News March 14, 2025
ఎంటెక్ ఫలితాల విడుదల

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఫిబ్రవరి నెలలో నిర్వహించిన ఎంటెక్ 1వ, 2వ సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ (R21) పరీక్షల ఫలితాలు విడుదల చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ పీ.చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ కే.మాధవి ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం కళాశాలలోని అకాడమిక్ సెక్షన్‌ను సంప్రదించాలని సూచించారు.
News March 14, 2025
నిర్మల్: బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌లో ఉచిత శిక్షణ

జిల్లాలోని డిగ్రీ పాసైన బీసీ అభ్యర్థులకు హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ తెలిపారు. నెలరోజుల శిక్షణ అనంతరం ప్రైవేట్ బ్యాంకులలో ప్లేస్మెంట్ కల్పిస్తారని, డిగ్రీ పూర్తయి 26 సంవత్సరాల కన్న వయసు తక్కువగా ఉన్నవారు ఏప్రిల్ 8వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
News March 14, 2025
మంచిర్యాల: వైద్యారోగ్య శాఖలో ఖాళీలు

మంచిర్యాల జిల్లా వైద్యారోగ్య శాఖలో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీ పోస్టుల భర్తీకి ఈ నెల 15 నుంచి 19 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ హరీశ్ రాజ్ తెలిపారు. వైద్య అధికారి, నర్సింగ్, ల్యాబ్ టెక్నీషియన్, పారామెడికల్ కం అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వివరించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు, ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు.