News January 26, 2025

నాలుగు పథకాలను ప్రారంభించిన సీఎం

image

TG: రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్ కార్డు పథకాలను సీఎం ఆవిష్కరించారు. నారాయణపేట జిల్లా చంద్రవంచ గ్రామంలో లబ్ధిదారులకు సంబంధిత పత్రాలను అందజేశారు. అంతకుముందు పలు గ్రామాల్లో సీఎం మాట్లాడిన వీడియో సందేశాన్ని ప్రదర్శించారు. రాష్ట్రంలోని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని, ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు.

Similar News

News September 13, 2025

కృష్ణా జలాల్లో 71% వాటా డిమాండ్ చేస్తున్నాం: ఉత్తమ్

image

TG: నదీ జలాల వాటా సాధనలో రాష్ట్ర ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 811 TMCల కృష్ణా జలాల్లో 71% డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. చుక్కనీటిని వదులుకునే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. ఈ నెల 23న ఢిల్లీలో జరిగే కృష్ణా ట్రిబ్యునల్-2 సమావేశంలో బలంగా వాదిస్తామన్నారు. గత పాలకుల ఉదాసీనత వల్ల ఏపీ అక్రమంగా నీటిని తరలించుకొని ప్రయోజనం పొందిందని విమర్శించారు.

News September 13, 2025

ఒంటరిగా ఉండకండి.. ఇది ప్రమాదకరం!

image

ప్రస్తుతం ఒంటరితనం ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. సోషల్ మీడియాలో ఉంటూ సమాజానికి దూరం కావడం, ఆర్థిక పరిస్థితులు, పట్టణీకరణ వంటి కారణాలతో ఒంటరితనం పెరిగినట్లు WHO పేర్కొంది. ఇది కేవలం మానసిక సమస్య కాదు, గుండె జబ్బులు, డిప్రెషన్‌ వంటి ఆరోగ్య సమస్యలకూ దారితీస్తుంది. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా ఏటా 8,71,000 మందికిపైగా చనిపోతున్నట్లు వెల్లడించింది. అంటే ఒంటరితనం వల్ల గంటకు 100 మంది చనిపోతున్నారన్నమాట.

News September 13, 2025

ALERT: ITR ఫైల్ చేయడం లేదా?

image

2024-25FYకి సంబంధించి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్(ITR) ఫైల్ చేయడానికి మరో 2 రోజులే గడువు ఉంది. కేంద్రం రూ.12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు ఇచ్చిందని చాలామంది ఫైల్ చేయడం లేదు. కానీ ఈ నిర్ణయం 2025-26 నుంచి అమల్లోకి రానుంది. 2024-25లో ఆదాయం రూ.3 లక్షలు దాటినవారు కూడా ఇప్పుడు ITR ఫైల్ చేయాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. SEP 15 డెడ్‌లైన్ దాటితే రూ.5వేల వరకు పెనాల్టీ పడుతుందని హెచ్చరిస్తున్నారు.