News January 26, 2025
పెద్దపల్లి ప్రజల చిరకాల కోరిక నెరవేరింది: కలెక్టర్

పెద్దపల్లి ప్రజల చిరకాల కోరిక ఆర్టీసీ బస్సు డిపో ఏర్పాట్లను ప్రభుత్వం నెరవేర్చిందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలో జరిగిన అభివృద్ధి పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంపీడీవో ప్రాంగణంలోని భూమి ఆర్టీసీ కు అప్పగించేందుకు చర్యలు చేపట్టామన్నారు. పెద్దపల్లిలో పరిశ్రమ శాఖ, ప్రజా పంపిణీ వ్యవస్థ, మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తున్నామన్నారు.
Similar News
News February 18, 2026
నిర్మల్ జిల్లాలో ఎల్లుండి సెలవు

ఫిబ్రవరి 20న నిర్మల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు పబ్లిక్ హాలిడే ఇస్తున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రకటించారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల సందర్భంగా స్థానిక సెలవు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. దానికి బదులు మార్చి 14 (రెండో శనివారం)ను పని దినంగా ఉంటుందన్నారు. సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
News February 18, 2026
నమీబియాపై ఘన విజయం.. సూపర్-8కి పాక్

T20WC: నమీబియాపై పాకిస్థాన్ 102 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో పాక్ సూపర్-8కి అర్హత సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 20 ఓవర్లలో 199/3 రన్స్ చేసింది. ఓపెనర్ ఫర్హాన్ సెంచరీ (58 బంతుల్లో 100)తో రాణించారు. అనంతరం నమీబియా 17.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌటైంది. కాగా సూపర్-8లో పాకిస్థాన్.. న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంకలతో తలపడనుంది.
News February 18, 2026
సముద్రంలో మొరాయించిన కోరంగి టూరిజం బోటు

తాళ్లరేవు మండలం చొల్లంగి నుంచి కోరంగి హోప్ ఐలాండ్‌కు 15 మంది పర్యాటకులతో వెళ్తున్న బోటు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. దీంతో పర్యాటకులు భయాందోళన చెందారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ బోటును పంపి పర్యాటకులను సురక్షితంగా తరలించేందుకు చర్యలు చేపట్టారు. అందరూ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. నిత్యం బోట్ల ఫిట్‌నెస్‌ను తనిఖీ చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.


