News January 26, 2025
పెద్దపల్లి జిల్లాలో 2,196 ఎకరాల సాగుకు యోగ్యం కానీ భూమి: కలెక్టర్

పెద్దపెల్లి జిల్లాలో 2,196 ఎకరాల భూమి సాగుకు యోగ్యం కాని భూమిని గుర్తించినట్టు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మిగిలిన వ్యవసాయ యోగ్యమైన భూమికి యాసంగి పంటకు పెట్టుబడి సాయం అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో 58 వేల ఎనిమిది వందల తొంబై ఆరు మంది రైతులకు రూ.446.54 కోట్ల మేర రుణమాఫీ జరిగిందన్నారు. సన్నారకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ 26,652 మంది రైతులకు అందించామన్నారు.
Similar News
News July 7, 2025
WGL: లోకల్ పంచాయితీ తెగేనా..!

స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబరు 30లోగా నిర్వహించాలని హైకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే BC రిజర్వేషన్ 42% అమలు అంశం గ్రామాల్లో కాక పుట్టిస్తోంది. మరో నెలన్నర లోపల ఎన్నికలు వస్తాయంటూ ఉమ్మడి జిల్లాలోని 1,702 పంచాయతీలు, 775 MPTC, 75 ZPTCల స్థానాల కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. పార్లమెంట్ ఆమోదిస్తేనే రిజర్వేషన్లు సాధ్యమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది.
News July 7, 2025
మెదక్: కుంటుంబం చెంతకు తప్పిపోయిన బాలుడు

మెదక్ పట్టణానికి చెందిన <<16899428>>వాసిప్ హుస్సేన్<<>> మానసిక స్థితి సరిగ్గా లేక వారం రోజుల కింద తప్పిపోయాడు. Way2Newsలో వచ్చిన కథనంతో తప్పిపోయిన బాలుడు కుటుంబం చేంతకు చేరాడు. వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్‌లో సంచరిస్తున్న బాలుడిని గ్రామస్థులు గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి వారికి అప్పగించారు. కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
News July 7, 2025
KNR: సర్కార్ స్కూల్ చిన్నారులకు కేంద్రమంత్రి శుభవార్త

కేంద్రమంత్రి బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సైకిళ్ల పంపిణీతో పాటు ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు కిట్స్ అందజేయనున్నారు. KNR లోక్‌సభ పరిధిలోని 50-60వేల చిన్నారులకు స్కూల్ బ్యాగ్, నోటు బుక్స్, పెన్స్, పెన్సిల్, వాటర్ బాటిల్, షూ కిట్‌ను అందించేస్తారని SGTU నేతలు తెలిపారు. ఒక్కొక్కరికి ₹1000 విలువైన కిట్లు అందనున్నాయి. ఈ సందర్భంగా మంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు.