News January 26, 2025
మందస: చెట్టుకు ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

మందస మండలం లోహరి బంద గ్రామంలోని జీడీ తోటల్లో తాళ్ల జానకిరావు(52) చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు మందస ఎస్సై కె.కృష్ణప్రసాద్ ఆదివారం తెలిపారు. భార్య కమల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మద్యానికి బానిసైన జానకిరావు రోజూ తాగి వస్తుండడంతో కుటుంబ సభ్యులు అడిగారు. వారితో గొడవపడి జీడీ తోటలకు వెళ్లి ఉరివేసుకున్నట్లు ఎస్సై తెలిజేశారు.
Similar News
News February 27, 2026
డయేరియా ప్రాంతంలో రాష్ట్ర వైద్యఆరోగ్య కమిషనర్ పర్యటన

శ్రీకాకుళం నగరంలో డయేరియా ప్రబలిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ శుక్రవారం పర్యటించారు. దమ్మలవీధిలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వ్యాధికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. తగిన సమయంలో వైద్యం అందించారా లేదా అని డీఎంహెచ్‌ఓ డాక్టర్ అనితను ప్రశ్నించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఫార్మాన్ ఖాన్ ఉన్నారు.
News February 27, 2026
SKLM: ‘డయేరియా బాధితులకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్యం’

డయేరియా వ్యాధితో బాధపడుతున్న వారు ఎవరైనా ఎన్టీఆర్ ఉచిత వైద్య సేవను పొందవచ్చని శ్రీకాకుళం జిల్లా ఆరోగ్యశ్రీ డైరెక్టర్ డాక్టర్ పీస అవని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్ క్లినిక్‌లకు వెళ్లిన వారు తమను సంప్రదిస్తే ఉచితంగా వైద్యం అందించటం జరుగుతుందన్నారు. రిమ్స్, జేమ్స్, మెడికవర్, కిమ్స్, సింధూర ఏవన్ ఆసుపత్రులకు పంపించి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు.
News February 27, 2026
SKLM: ఇంటర్ పరీక్షలకు 289 మంది గైర్హాజరు

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలకు శుక్రవారం 289 మంది గైర్హాజరయ్యారు. హిస్టరీ బాటనీ ఒకేషనల్ కోర్సుల్లో 60 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాశారు. రెగ్యులర్ కోర్సులకు 1,538 మంది హాజరు కావాల్సి ఉండగా, 1,372 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 1,500 మంది రాయాల్సి ఉండగా, 1,377 మంది విద్యార్థులు రాశారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడలేదు.


