News January 26, 2025

కామారెడ్డి: కలెక్టరేట్‌లో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

image

కామరెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. బాన్సువాడ, రాజంపేట్ పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు చేసిన ప్రదర్శనలను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ సింధు శర్మ, అదనపు కలెక్టర్‌లు శ్రీనివాస్ రెడ్డి, వి విక్టర్, ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి తిలకించారు. అనంతరం విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు.

Similar News

News January 29, 2026

ఒంటిమిట్ట: ఇవాళ ఘనంగా భీష్మ ఏకాదశి వేడుకలు

image

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి సన్నిధిలో ఇవాళ భీష్మ ఏకాదశి సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ టీటీడీ అధికారులు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని మూలవిరాట్‌కి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఉత్సవ మూర్తులను పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు తొడిగి, తులసి గజమాలలతో సుందరంగా అలకరించి, ఘనంగా గ్రామోత్సవాన్ని నిర్వహించనున్నారు.

News January 29, 2026

పిల్లలకు SM బ్యాన్‌పై విధివిధానాలు రూపొందించండి: మంత్రి లోకేశ్

image

AP: మైనర్లను సోషల్ మీడియాకు దూరంగా ఉంచే విషయంపై విధివిధానాలను రూపొందించాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. ‘సోషల్ మీడియా జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడంపై మంత్రులతో జరిగిన మీటింగ్‌లో చర్చించాం. చిన్నారులకు SMను నిషేధించే అంశంపై సింగపూర్, AUS, మలేషియా, ఫ్రాన్స్‌లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని, ఫేక్ పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించా’ అని ట్వీట్ చేశారు.

News January 29, 2026

TU: బీఈడీ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ మార్పు.!

image

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ (B.Ed) మూడవ సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రీ పోన్ చేసినట్లు సీఓఈ (COE) ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం.. మొదటి ఫేజ్ పరీక్షలు ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 4 వరకు, రెండో ఫేజ్ ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు జరగనున్నాయి. కళాశాలల ప్రిన్సిపాల్స్ సంబంధిత ప్రతులను ఈనెల 29లోగా సమర్పించాలని ఆయన ఆదేశించారు.