News January 26, 2025

కథలాపూర్: ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

image

కథలాపూర్ మండలం సిరికొండకు చెందిన కనికరపు నర్సయ్య అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై నవీన్ కుమార్ ఆదివారం తెలిపారు. నిన్న తన భార్యతో గొడవ పడి ఆమెను ఇష్టం వచ్చినట్లు కొట్టగా.. ఆమె తన తల్లిగారింటికి వెళ్లింది. దీంతో మనస్తాపం చెంది క్షణికావేశంలో తన ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. మృతుని తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News November 12, 2025

ఒకే వేదికపైకి రష్మిక, విజయ్..! అధికారికంగా ప్రకటిస్తారా?

image

ప్రేమ, త్వరలో పెళ్లి వార్తల వేళ హీరోయిన్ రష్మిక మందన్న, హీరో విజయ్ దేవరకొండ ఇవాళ ఒకే వేదికపై కనిపించనున్నట్లు తెలుస్తోంది. రష్మిక నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరగనుంది. దీనికి విజయ్ చీఫ్ గెస్ట్‌గా వస్తారని సమాచారం. ఈ వేదికగా తమ పెళ్లి గురించి అధికారికంగా ప్రకటిస్తారేమోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

News November 12, 2025

మదనపల్లె కిడ్నీ రాకెట్ చేతిలో బలైన యమునా సూరిబాబు భార్యే కాదు?

image

మదనపల్లెలో కిడ్నీ రాకెట్ ముఠా చేతిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖ మధురవాడకు చెందిన <<18263667>>యమున సూరిబాబు భార్యకాదని<<>> తెలుస్తోంది. మాయమాటలు చెప్పి షాపింగ్ పేరుతో మదనపల్లెకు తీసుకువచ్చిన కిడ్నీ రాకెట్‌లోని మద్యవర్తులు కాకర్ల సత్య, పెళ్లి పద్మ, వెంకటేశ్వర్లు ఆమెకు పథకం ప్రకారం మత్తు ఇచ్చినట్లు సమాచారం. అర్ధరాత్రి ఆసుపత్రికి తీసుకువచ్చి కిడ్నీ దొంగలించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

News November 12, 2025

బిలియనీర్ల అడ్డా ముంబై, ఢిల్లీ!

image

ప్రపంచంలో ఎక్కువ మంది బిలియనీర్లు ఉండే టాప్-10 నగరాల జాబితాలో ముంబై, ఢిల్లీ చోటు దక్కించుకున్నాయి. 119 మంది కుబేరులతో న్యూయార్క్ టాప్‌లో ఉందని హురున్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత లండన్(97), ముంబై(92), బీజింగ్(91), షాంఘై(87), షెంజెన్(84), హాంకాంగ్(65), మాస్కో(59), ఢిల్లీ(57), శాన్‌ఫ్రాన్సిస్కో(52) ఉన్నాయి.