News March 18, 2024
శ్రీకాకుళం: పదో తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న పదో తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ సోమవారం పరిశీలించారు. విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయా గదుల్లో తిరుగుతూ.. పరీక్ష నిర్వహణ తీరును పర్యవేక్షించారు. విద్యార్థుల హాజరును కలెక్టర్ ఆరా తీశారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని ఎలాంటి పొరపాట్లకు తావివొద్దన్నారు.
Similar News
News September 8, 2025
శ్రీకాకుళం: విద్యార్థులకు గమనిక

ఏపీ పీజీ సెట్-2025 పరీక్షలకు వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఏడాది ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత చెందిన వారు వెబ్‌ఆప్షన్ ద్వారా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలోని పలు కోర్సుల్లో సీట్లు పొందవచ్చు. ఇతర వివరాలకు సీఈటీఎస్. ఏపీఎస్‌సీహెచ్‌సీ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్ సైట్‌ను చూడవచ్చు. వెబ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు ఈ నెల 8-15 వరకు జరగనుంది.
News September 8, 2025
యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దు: కలెక్టర్

శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం 1600 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం వెల్లడించారు. మరో వారం రోజుల్లో 3 వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. తదుపరి విడత ఎరువులు వచ్చే అంచనా తేదీని గ్రామ వ్యవసాయ సహాయకులు, మండల వ్యవసాయ అధికారులు రైతులకు తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు
News September 8, 2025
శ్రీకాకుళంలోయథాతథంగా గ్రీవెన్స్

శ్రీకాకుళం నగరంలోని జడ్పీ కార్యాలయంలో నేడు గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు కార్యాలయానికి వచ్చి తమ ఫిర్యాదులు నేరుగా అందజేయవచ్చన్నారు. ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.