News January 26, 2025

విశాఖలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం 

image

విశాఖలోని ఆశీల్‌మెట్టలో యువకుడి మృతదేహం లభ్యమైంది. త్రీ టౌన్ ఎస్‌ఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం ఓ స్కూల్ గేట్ ఎదురుగా మృతదేహం ఉన్నట్లు స్థానికులు సమాచారం అందించారని తెలిపారు. మృతుడి వయసు సుమారు 25 నుంచి 30 సంవత్సరాలు ఉంటుందని పేర్కొన్నారు. మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించినట్లు తెలిపారు. మృతుని వివరాలు తెలిస్తే తమను సంప్రదించాలని ఎస్‌ఐ సురేష్ కోరారు.

Similar News

News January 29, 2025

విశాఖ కేంద్ర కారాగారంలో అందుబాటులోకి ఆన్లైన్ ములాఖత్

image

విశాఖ కేంద్ర కారాగారంలో ఆన్‌లైన్‌లో ముందుగా ములాఖత్ రిజిస్టర్ చేసుకునేందుకు అవకాశం ఉన్నట్లు జైలు సూపరింటెండెంట్ మహేశ్ బాబు తెలిపారు. https://eprisons.nic.in వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకుని ముందుగా ములాఖత్ డేట్ తీసుకోవచ్చని తెలిపారు. ఒక్కో ములాఖాత్‌కు ముగ్గురు విజిటర్స్ సంబంధిత ఖైదీని కలిసి మాట్లాడుకునే సదుపాయం ఉందన్నారు. రిమాండ్ నిందితులకు వారానికి రెండు ములాఖత్‌లు అందుబాటులో ఉంటాయన్నారు.

News January 28, 2025

విశాఖ: మహిళ నుంచి రూ.2.5కోట్లు దోచేశారు

image

విశాఖకు చెందిన ఆరుగురు నిందితులను తిరుపతి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. తిరుపతి SP హర్షవర్ధన్ వివరాల ప్రకారం.. విశాఖకు చెందిన నిందితులు ఇటీవల తిరుపతి మహిళకు ఫోన్ చేశారు. రూ.200 కోట్ల మనీలాండరింగ్ జరిగిందని భయపెట్టి ఆమె నుంచి రూ.2.5 కోట్ల దోచుకున్నారు. మోసపోయినట్లు గుర్తించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులను అదుపులో తీసుకుని ఓ కారు, రూ.3.2 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.

News January 28, 2025

POLITICAL: విశాఖ వైసీపీకి పెద్దన్న గుడివాడేనా?

image

ఉమ్మడి విశాఖ YCPలో ఇప్పటి వరకు వలస నేతలే ఆధిపత్యం చెలాయించేవారన్న విమర్శలున్నాయి. గతంలో రీజనల్ కో-ఆర్డినేటర్లుగా విజయసాయిరెడ్డి,సుబ్బారెడ్డి వంటి వారు ఉండటమే దీనికి కారణం. కాగా..విజయసాయిరెడ్డి,అవంతి,ఆడారి రాజీనామాతో విశాఖ జిల్లా అధ్యక్షుడిగా, చోడవరం ఇన్‌ఛార్జ్‌గా మాజీమంత్రి అమర్నాథ్‌‌కు బాధ్యతలు అప్పగించారు. గుడివాడ తనదైన శైలిలో కూటమి ప్రభుత్వంపై దాడి చేస్తూ పార్టీలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు.