News January 26, 2025
KNR: సంక్షేమ హస్టల్లో మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం సరఫరా

కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 68 వేల 488 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం, ప్రతి నెల 396 టన్నుల సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని కలెక్టర్ పమేలా సత్పతి లిపారు. రాష్ట్ర ప్రభుత్వం డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచుతూ ప్రకటించిన కామన్ డైట్ మెనూను జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు.
Similar News
News October 29, 2025
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: KNR కలెక్టర్

తుఫాన్ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలో అక్టోబర్ 29, 30న వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. అత్యవసమైతే తప్ప ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు.
News October 29, 2025
కరీంనగర్: పత్తి రైతులకు శుభవార్త..!

కరీంనగర్ జిల్లాలోని పత్తి రైతులకు 6 జిన్నింగ్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగోళ్లు ప్రారంభించిందని జిల్లా మార్కెటింగ్ అధికారి యం.డి షాహబోద్ధిన్ తెలిపారు. 1. శక్తి మురుగన్ ఇండస్ట్రీ, జమ్మికుంట ఎలబోతారం, 2. వైభవ్ కాటన్ కార్పోరేషన్ 3. నరసింహ కాటన్ జిన్మింగ్ 4.సరిత కాటన్ ఇండస్ట్రీస్ 5. సీతారామ కాటన్ ఇండస్ట్రీ 6. కావేరి జిన్నింగ్ మిల్లు, వెలిచాల. రైతులు కాపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు.
News October 29, 2025
జమ్మికుంట: మార్కెట్‌కు 4 రోజులు సెలవులు

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు 4 రోజులు సెలవులు ప్రకటించామని మార్కెట్ ఛైర్ పర్సన్ పుల్లూరి స్వప్న, ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం తెలిపారు. తుఫాన్ కారణంగా ఖరీదారులు, అడ్తిదారుల విన్నపం మేరకు ఈనెల 30, 31, NOV 1న మార్కెట్ యార్డుకు మూడు రోజులు సెలవు, ఆదివారం సాధారణ సెలవు ఉంటుందని పేర్కొన్నారు. CCI ద్వారా యధావిధిగా క్రయవిక్రయాలు జరుగుతాయని పేర్కొన్నారు. రైతులు, వ్యాపారులు, కార్మికులు గమనించాలన్నారు.


