News January 26, 2025

SRPT: 50 ఏళ్లకు.. పూర్వ విద్యార్థుల సమ్మేళనం

image

సూర్యాపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. 1975-76లో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు దాదాపు 50 ఏళ్ల తర్వాత ఆదివారం పాఠశాలలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా 65 ఏళ్ల వయసులో ఉన్న ఆ స్నేహితులు గత స్మృతులను గుర్తు చేసుకొని సందడి చేశారు. తమ మనవళ్లు చేసుకునే సమ్మేళనం తాము చేసుకుంటున్నాం అంటూ ఆనందంగా గడిపారు. 50 ఏళ్లయినా స్నేహానికి వయసు లేదని చెబుతున్నారు.

Similar News

News November 10, 2025

ప్రకాశం జిల్లాలో సీఎం పర్యటన షెడ్యూల్.!

image

ప్రకాశంలో 11వ తేదీన సీఎం చంద్రబాబు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. పీసీ పల్లిలోని పెదఇర్లపాడు వద్ద మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉదయం 10.15 గంటలకు పెదయిర్లపాడు హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు. 10.35 నుంచి 12.15 వరకు పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత హెలికాప్టర్లో తాడేపల్లికి బయలుదేరి వెళ్తారు.

News November 10, 2025

అందెశ్రీ మృతిపై కేసీఆర్, కిషన్ రెడ్డి, సంజయ్ సంతాపం

image

ప్రజాకవి అందెశ్రీ మరణం పట్ల మాజీ సీఎం KCR, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధనలో కవిగా తన పాటలు, సాహిత్యంతో కీలకపాత్ర పోషించిన అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటని KCR అన్నారు. ఉద్యమ కాలంలో ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అందెశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆకాంక్షించారు.

News November 10, 2025

వరంగల్ ఆర్టీఏలో వాట్సాప్లోనే ఫిక్సింగ్..!

image

వరంగల్ ఆర్టీఏలో ఏ వాహనానికి ఎంత మామూలు ఇవ్వాలో వాట్సాప్లోనే ఏజెంట్లకు,అధికారుల బినామీల మధ్య సంభాషణలు జరుగుతున్నాయి. నేరుగా పని కోసం వెళ్లే వాహనదారులకు మాత్రం తమ దరఖాస్తు మీద ఎర్ర టిక్ లేకపోతే సాకులు చెప్పి తిప్పడం, చివరకు దరఖాస్తుదారుడు ఏజెంట్ల దగ్గరికి వెళ్లేలా చేయడంలో కౌంటర్ సిబ్బంది ఆరితేరి పోయారు. ఏసీబీదాడులు నామమాత్రంగానే ఉంటున్నాయని, వాహనదారులు చెబుతుండటం అక్కడ జరుగుతున్న అవినీతికి నిదర్శనం.