News January 26, 2025

PPM: స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు సన్మానం

image

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గణతంత్ర దినోత్సవ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ చేతుల మీదుగా ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా స్వతంత్ర సమరయోధులు పాలూరు సాంబమూర్తి కుమార్తె పాలూరు భారతిని కలెక్టర్ సన్మానించారు.

Similar News

News January 16, 2026

వర్ని: కొత్త అల్లుడికి 150 వంటకాలతో విందు

image

వర్నిలో సంక్రాంతి సందర్భంగా ఇంటికి వచ్చిన అల్లుడికి 150 రకాల వంటకాలతో విందు ఇచ్చారు. లక్ష్మి-రాంబాబు దంపతులు తమ కుమార్తెకు రెండు నెలల క్రితమే వివాహం జరిపించారు. సంక్రాంతి పండుగకు తొలిసారి ఇంటికి వచ్చిన అల్లుడి కోసం మంగాదేవితో కలిసి ఏకంగా 150 రకాల తీపి, పిండి వంటలను సిద్ధం చేశారు. పెద్ద అరటి ఆకులో ఈ వంటకాలన్నింటినీ వడ్డించి, కుటుంబ సమేతంగా విందు ఇచ్చారు.

News January 16, 2026

విశాఖ: చీర విషయంలో గొడవ.. బాలిక ఆత్మహత్య

image

విశాఖలో పండగ పూట విషాదం నెలకొంది. MVP పోలీసుల వివరాల ప్రకారం.. పాత వెంకోజీ పాలెంలో ఉంటున్న బాలిక పల్లవి పండగ సందర్భంగా చీర కట్టుకుంటానని తల్లి లక్ష్మిని కోరింది. చీర వద్దు హాఫ్‌శారీ కట్టుకోమని తల్లి చెప్పడంతో గురువారం సాయంత్రం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన పల్లవి MVP కాలనీలో తన తాతయ్య వాచ్మెన్‌గా ఉంటున్న రెసిడెన్సి వద్ద ఆత్మహత్య చేసుకుంది. లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

News January 16, 2026

162 పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ విడుదల

image

NABARD 162 డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థుల నుంచి జనవరి 17నుంచి ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తు స్వీకరించనుంది. వయసు 21 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.32,000 చెల్లిస్తారు. పూర్తి స్థాయి నోటిఫికేషన్ రేపు విడుదల చేయనున్నారు. వెబ్‌సైట్: https://www.nabard.org