News January 26, 2025
ఈ నెల 31న టీటీడీ పాలకమండలి భేటీ

AP: టీటీడీ పాలకమండలి జనవరి 31న అత్యవసర సమావేశం కానుంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో రథసప్తమి ఏర్పాట్లపై పాలకమండలి సభ్యులు, అధికారులు సమీక్ష నిర్వహించనున్నారు. ఇటీవల తిరుపతి తొక్కిసలాట ఘటన దృష్ట్యా పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నారు. అటు ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు సర్వదర్శనం టోకెన్లను రద్దు చేశారు. ఫిబ్రవరి 4న ఆర్జిత సేవలు, సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలనూ రద్దు చేశారు.
Similar News
News July 10, 2025
400 రన్స్ చేసే అవకాశాలు మళ్లీ మళ్లీ రావు: గేల్

SA కెప్టెన్ ముల్డర్ ఇటీవల టెస్టులో 400రన్స్ చేసే అవకాశం ఉన్నా వద్దనుకోవడం చర్చనీయాంశమైంది. దీనిపై WI క్రికెట్ దిగ్గజం గేల్ స్పందించారు. ఇటువంటి అవకాశాలు మళ్లీ మళ్లీ రావన్నారు. ఛాన్స్ దొరికినప్పుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తనకు ఇటువంటి అవకాశమొస్తే వదలనని చెప్పారు. లారా(400*) రికార్డును అధిగమించే ఉద్దేశం లేకే 367* స్కోర్ వద్ద డిక్లేర్ చేసినట్లు ముల్డర్ వెల్లడించిన విషయం తెలిసిందే.
News July 10, 2025
బ్యాటరీ సైకిల్ రూపొందించిన విద్యార్థికి పవన్ అభినందనలు

AP: బ్యాటరీ సైకిల్ రూపొందించిన విజయనగరం ఇంటర్మీడియట్ విద్యార్థి రాజాపు సిద్ధూను Dy.CM పవన్ కళ్యాణ్ అభినందించారు. SM ద్వారా అతడి ఆవిష్కరణ గురించి తెలుసుకుని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించారు. అతడిని బ్యాటరీ సైకిల్‌పై ఎక్కించుకుని ఆయన స్వయంగా నడిపారు. భవిష్యత్తులో సరికొత్త ఆలోచనలు చేయాలని ఆకాంక్షిస్తూ ప్రోత్సాహకంగా రూ.లక్ష అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను Dy.CMO రిలీజ్ చేసింది.
News July 9, 2025
27వ అంతర్జాతీయ పురస్కారం అందుకున్న మోదీ

నమీబియా పర్యటనలో ఉన్న PM మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం దక్కింది. ‘ఆర్డర్ ఆఫ్ ది ఏన్షియంట్ వెల్విట్షియా మిరాబిలిస్’ పురస్కారాన్ని నమీబియా అధ్యక్షురాలు నెతుంబో నంది ప్రధానికి అందజేశారు. 2014లో PM అయినప్పటి నుంచి మోదీకి ఇది 27వ అంతర్జాతీయ అవార్డు. 5దేశాల పర్యటనలో భాగంగా ఆయన ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్ దేశాల్లో పర్యటించి ఆ దేశాల పురస్కారాలు అందుకున్న విషయం తెలిసిందే.