News January 26, 2025

నంద్యాల: అంతర్జాతీయ క్రీడాకారుడు ASIకి అభినందనల వెల్లువ

image

పాణ్యం మండల కేంద్రానికి చెందిన అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు సీ.నాగ గోపేశ్వరరావు రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ఉత్తమ అధికారిగా ఎంపికయ్యారు. గుంతకల్లు డివిజన్లో రైల్వే ఏఎస్ఐగా పనిచేస్తూ విధి నిర్వహణలో ఉత్తమ సేవలకు గాను ఆయన ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. గ్రామానికి చెందిన పలువురు క్రీడాకారులు, గ్రామ పెద్దలు, ప్రజలు నాగ గోపేశ్వరావుకు అభినందనలు తెలిపారు.

Similar News

News September 19, 2025

కోకా‌పేట్‌లో భర్తను చంపిన భార్య

image

కోకాపేట్‌లో భర్తను భార్య హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసుల ప్రకారం.. గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భర్తపై భార్య కత్తితో దాడి చేసింది. ఇంట్లో నుంచి కేకలు రావడంతో స్థానికులు అక్కడికి వచ్చారు. రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. వారు అస్సాంకి చెందిన వారిగా గుర్తించారు. భార్యాభర్తల మధ్య విభేదాలే ఈ దారుణానికి దారితీశాయి.

News September 19, 2025

భద్రాచలం: ‘పద్ధతి మార్చుకోకపోతే మరణ శిక్ష తప్పదు’

image

మావోయిస్టు పార్టీపై పెత్తందారులు చేస్తున్న అసత్య ప్రచారం మానుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భద్రాద్రి కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు డివిజన్ మావోయిస్టు పార్టీ పేరుతో లేఖ విడుదలైంది. చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండలాలకు చెందిన పలువురి పేర్లను ప్రస్తావిస్తూ ఇన్‌ఫార్మర్లుగా మారి తమను మాయ చేస్తున్నారని, పద్ధతి మార్చుకోకపోతే ప్రజా కోర్టులో మరణ శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ లేఖ సంచలనంగా మారింది.

News September 19, 2025

చిత్తూరు: టమాటా ప్రాసెసింగ్ యూనిట్ కలేనా..?

image

చిత్తూరు జిల్లా టమాటా పంటకు పెట్టింది పేరు. ఆసియాలోనే అతి పెద్ద టమాటా మార్కెట్‌గా పేరు గడించింది. రోజుకు 1,500 టన్నుల పంటకు ఇక్కడ వేలం నిర్వహించే అవకాశం ఉంది. ఇంత ఉన్నా రైతులు మాత్రం నష్టాలతో పంటను సాగు చేస్తున్నారు. ఏళ్ల తరబడి పాలకులు టమాటో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నా కార్యరూపం మాత్రం దాల్చ లేదు. ఇప్పటికైనా పాలకులు దీనిపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.