News January 26, 2025
కరీంనగర్: త్రివర్ణపతాకం రూపంలో సూర్యాస్తమయం

గణతంత్ర దినోత్సవం నాడు కరీంనగర్ జిల్లాలో అద్భుత దృశ్యం Way2News కెమెరాకు చిక్కింది. జమ్మికుంట మండలం సైదాబాద్‌లో సూర్యాస్తమయ సమయంలో త్రిపర్ణపతాకం ఆకారం ఆవిష్కృతమైంది. పంటపొలాలు, మధ్యలో ఆకాశం, పైన సూర్యాస్తమయ ఆకాశం ఈ మూడు కలగలిసి త్రివర్ణ పతాకాన్ని ఏర్పరిచాయి. ఇది చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
Similar News
News January 17, 2026
గ్రేటర్ వరంగల్‌లో ఊహాగానాలకు బ్రేక్.. రిజర్వేషన్లు ఇవే!

మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వార్డులకు రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. ఉమ్మడి జిల్లాలోని 11 మున్సిపాలిటీలలోని 260 వార్డులతో పాటు గ్రేటర్ WGL నగరపాలక సంస్థకు చెందిన 66 డివిజన్లకు రిజర్వేషన్లు చేసింది. ప్రస్తుతమున్న 66 డివిజన్లకు అదనంగా మరో 22 పెంచుతారన్న ఊహాగానాలకు చెక్ పెట్టింది. గ్రేటర్‌లోని 66 డివిజన్లలో ST-2, SC-11, BC-20, మహిళా(జనరల్)-17, అన్ రిజర్వ్-16 డివిజన్లను కేటాయించారు.
News January 17, 2026
నెల్లూరు: మీ పిల్లలపై ప్రత్యేక జాగ్రత్తలు అవసరం

నెల్లూరు జిల్లాలో సముద్ర తీరాలకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు హెచ్చరిస్తున్నారు. లోతు, సుడిగుండాలు తెలియకుండా నీటిలోకి దిగితే ప్రాణాపాయం తప్పదని సూచించారు. బీచ్ వద్ద ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను తప్పనిసరిగా పాటించాలని, పిల్లలను నీటి దగ్గర ఒంటరిగా వదలరాదని తెలిపారు. ఒక్క నిమిషం అజాగ్రత్త కుటుంబానికి జీవితకాల దుఃఖాన్ని మిగుల్చుతుందని హెచ్చరిస్తున్నారు.
News January 17, 2026
కర్నూలు: సంక్రాంతి నాడు విషాదాంతాలు

సంక్రాంతి పండుగ నాడు పలు కుటుంబాల్లో విషాదం మిగిలింది. పుల్లూరు టోల్ ప్లాజా వద్ద బైక్ ఢీకొని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మృతిచెందారు. పాణ్యం(M) తమ్మరాజుపల్లెలో వాహనం ఢీకొని రత్నమ్మ(50) మరణించింది. బేతంచెర్ల(M) శంకలాపురం గ్రామానికి చెందిన దస్తగిరి(33) బొలెరో ఢీకొని చనిపోయాడు. అప్పుల బాధతో గోనెగండ్లలో కౌలు రైతు జైనుద్దీన్, ఆదోనికి చెందిన వెంకటేశ్(42), కర్నూలుకు చెందిన శివకుమార్(33) ఉరేసుకున్నారు.


