News January 26, 2025
సంగారెడ్డి: రేపటి నుంచే 10వ తరగతి ప్రాక్టీస్ పేపర్-1 పరీక్షలు

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు రేపటి నుంచి ఫిబ్రవరి 4 వరకు ప్రాక్టీస్ పేపర్-1 పరీక్షలను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. ప్రాక్టీస్ పేపర్లకు సంబంధించిన ప్రశ్నా పత్రాలను మండల వనరుల కేంద్రాల నుంచి తీసుకోవాలని సూచించారు.
Similar News
News November 11, 2025
సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో PO ఉద్యోగాలు

సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్(PO) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. CMA/ICWA అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి ఈ నెల 19 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://www.southindianbank.bank.in
News November 11, 2025
అరటి ఆకులో భోజనం చేస్తే ఇన్ని ప్రయోజనాలా?

శుభకార్యాల సమయంలో చాలా మంది అరటి ఆకులో భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఇది సంప్రదాయమే కాక ఆరోగ్యపరంగానూ ప్రయోజనకరమని వైద్యులు చెబుతున్నారు. అరటి ఆకులో ఉన్న పాలీఫినాల్స్ & యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఆహారంలో హానికరమైన బ్యాక్టీరియా పెరగకుండా నిరోధిస్తాయంటున్నారు. అలాగే ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని, సహజ రుచిని ఆస్వాదించవచ్చని పేర్కొంటున్నారు.
News November 11, 2025
ధాన్యం కొనుగోలు కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

యాదాద్రి భువనగిరి(D) బీబీనగర్(M) రుద్రవెల్లిలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ హనుమంత రావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రానికి వచ్చిన, ఇంకా రావాల్సిన ధాన్యం వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు తేమశాతం తప్పనిసరిగా తనిఖీ చేసి, నాణ్యత కలిగిన ధాన్యాన్ని వెంటనే కాంటా వేయాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని అదే రోజు లారీలలో మిల్లులకు తరలించాలన్నారు.


