News January 26, 2025
సీఎం చంద్రబాబు ఆగ్రహం

AP: సత్యసాయి(D) సికేపల్లి వసతి గృహంలో విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందని విషయంపై CM చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ విద్యార్థులకు వార్డెన్, సంబంధిత ఉద్యోగులు మధ్యాహ్నం భోజనం వండలేదని తెలియడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే భోజనం సమకూర్చినట్లు ఫోన్ చేసిన సీఎంకు కలెక్టర్ వివరించారు. పూర్తిస్థాయిలో విచారించి నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని CM ఆదేశించారు.
Similar News
News September 3, 2025
ఎలాంటి TRS ఎలా అయిపోయింది..

ప్రత్యేక తెలంగాణ కోసం ఏర్పడిన TRS దాదాపు పదేళ్లు అధికారంతో వర్థిల్లింది. ఆ పార్టీ పేరు చెప్పగానే KCR, హరీశ్‌రావు, KTR, కవితే గుర్తొచ్చేవారు. అలాంటి పార్టీ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. BRSగా రూపాంతరం చెందడం, 2023 ఎన్నికల్లో ఓటమి పార్టీ రూపురేఖల్ని మార్చింది. ఆపై పలువురు MLAలు BRSను వీడగా, ఇప్పుడు KCR కూతురే దూరమవడం పార్టీ పరిస్థితికి అద్దం పడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
News September 3, 2025
సత్యమేవ జయతే: కవిత

TG: ఇవాళ మధ్యాహ్నం బీఆర్ఎస్‌కు, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె మరో ట్వీట్ చేశారు. ‘నిజం మాట్లాడినందుకు నాకు దక్కిన బహుమతి ఇదే అయితే.. తెలంగాణ ప్రజల కోసం వంద రెట్లు మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధం. సత్యమేవ జయతే. జై తెలంగాణ’ అని రాసుకొచ్చారు. బీఆర్ఎస్ నుంచి వస్తున్న విమర్శలకు కౌంటర్‌గానే ఆమె ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.
News September 3, 2025
కవిత.. ఇది పద్ధతి కాదు: నిరంజన్ రెడ్డి

TG: బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానంలో హరీశ్ రావు పాత్ర మరువలేనిదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. గతంలో హరీశ్‌ను పొగిడిన వారు, ఇప్పుడు విమర్శిస్తున్నారని చెప్పారు. <<17599925>>కవిత<<>> రివర్స్ గేర్ ఎందుకు తీసుకున్నారో అర్థం కావట్లేదన్నారు. రేవంత్ కాళ్లు మొక్కి హరీశ్ సరెండర్ అయ్యారంటూ నీచమైన ఆరోపణలు చేస్తారా? అని ప్రశ్నించారు. దీని వెనుక ఏం జరిగిందో తెలియట్లేదని, ఇది పద్ధతి కాదన్నారు.