News January 26, 2025

కూటమి కోసం బాధ్యతగా ఉండాలి: పవన్

image

AP: NDA శ్రేణులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాన్ని కాపాడేలా బాధ్యతగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. అనవసర వివాదాలు, విభేదాల జోలికి వెళ్లవద్దని కోరారు. తప్పుడు వార్తలపై, కూటమి అంతర్గత విషయాలపై ఎవరైనా స్పందించినా దయచేసి ఎవరూ ప్రతిస్పందనగా వ్యక్తిగత అభిప్రాయాలు వెలిబుచ్చవద్దని సూచించారు. తాను ఏ రోజూ పదవుల కోసం రాజకీయం చేయలేదని, భవిష్యత్తులోనూ చేయనని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News September 19, 2025

మోదీతో మంచి స్నేహం ఉంది: ట్రంప్

image

భారత్, PM మోదీతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని US అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. మోదీతో మంచి స్నేహం ఉందని, ఆ కారణంగానే ఆయనకు నిన్న బర్త్ డే విషెస్ తెలిపానన్నారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో ద్వైపాక్షిక భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. చమురు కొనుగోళ్లు ఆపేస్తేనే రష్యా దిగి వస్తుందని చెప్పారు. చైనా ఇప్పటికే అమెరికాకు భారీ టారిఫ్‌లు చెల్లిస్తోందని, మరిన్ని విధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

News September 19, 2025

SMలో ప్రభాస్ Vs దీపిక ఫ్యాన్స్ వార్

image

ప్రభాస్ ‘కల్కి-2’లో <<17748690>>దీపికను<<>> పక్కనపెట్టడంతో ఇద్దరు స్టార్ల ఫ్యాన్స్ మధ్య SMలో వార్ జరుగుతోంది. దీపిక గొంతెమ్మ కోరికలు కోరతారని, పని గంటల పేరుతో ఇబ్బంది పెడతారని డార్లింగ్ అభిమానులు అంటున్నారు. అందుకే వర్క్‌పై ‘ఎక్కువ కమిట్‌మెంట్’ లేదనే కారణంతో పక్కన పెట్టారని చెబుతున్నారు. అయితే కల్కి-1 సమయంలో ప్రెగ్నెంట్ అయినా దీపిక నటించారని, అంతకంటే ఇంకేం కమిట్‌మెంట్ కావాలని ఆమె మద్దతుదారులు కౌంటర్ ఇస్తున్నారు. ఈ వివాదంపై మీ కామెంట్?

News September 18, 2025

అత్యాచారం కేసులో లలిత్ మోదీ సోదరుడు అరెస్ట్

image

IPL మాజీ చీఫ్ లలిత్ మోదీ సోదరుడు, వ్యాపారవేత్త సమీర్‌ మోదీ ఢిల్లీలో అరెస్ట్ అయ్యారు. అత్యాచారం కేసులో ఆయన్ను ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో సమీర్‌తో సహజీవనం చేసిన మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ క్రమంలో అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా ఒకరోజు జుడీషియల్ కస్టడీ విధించారు. ఈ కేసులో సదరు మహిళ సమీర్‌ను రూ.50కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం.