News March 18, 2024

గిల్‌కు మేం అండగా ఉంటాం: గ్యారీ కిర్‌స్టెన్

image

హార్దిక్ పాండ్య ముంబైకు వెళ్లిపోవడంతో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్సీ శుభ్‌మన్ గిల్ చేతికి వచ్చింది. అయితే, ఐపీఎల్ స్థాయిలో కెప్టెన్సీని యువ ఆటగాడైన గిల్ ఎలా నెట్టుకొస్తారన్న అనుమానాలను జీటీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ తోసిపుచ్చారు. ‘నాయకత్వ బాధ్యతల్ని గిల్ సమర్థంగా నిర్వహిస్తారన్న నమ్మకం మాకుంది. అవసరమైన సాయాన్ని అందించి అండగా నిలుస్తాం. సవాళ్లను ఎదుర్కొని నిలబడగలిగే సత్తా తనకు ఉంది’ అని పేర్కొన్నారు.

Similar News

News September 30, 2024

గ్రేట్.. కొండపై ఔషద మొక్కలు పెంచుతున్నాడు!

image

ఒడిశాకు చెందిన ప్రకృతి ప్రేమికుడు పుపున్ సాహూను అభినందిస్తూ ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త ఎరిక్ సోల్హెమ్ ట్వీట్ చేశారు. ‘సోషల్ మీడియాకు దూరంగా ఉండే ఈ యువ వడ్రంగి ప్రకృతి పరిరక్షణకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నయాగఢ్‌లోని కుసుమి నది నుంచి నీటిని తీసుకొచ్చి ఎంతో క్లిష్టతరమైన కొండ ప్రాంతంలో 800కు పైగా ఔషధ, వివిధ రకాల చెట్లను పెంచుతున్నారు. ఈయన రియల్ లోకల్ ఛాంపియన్’ అని ఆయన కొనియాడారు.

News September 30, 2024

‘హైడ్రా’ కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు చురకలు

image

TG: హైడ్రా ఏర్పాటు అభినందనీయమేనని.. పనితీరే అభ్యంతరకరంగా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. అమీన్‌పూర్ ఎమ్మార్వో, హైడ్రా కమిషనర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సెలవుల్లో నోటీసులు ఇచ్చి అత్యవసరంగా ఎందుకు కూలుస్తున్నారని ప్రశ్నించింది. హైడ్రాకు కూల్చివేతలు తప్ప మరో పాలసీ లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము అడిగిన ప్రశ్నకే సమాధానం ఇవ్వాలని, దాట వేయొద్దని కమిషనర్ రంగనాథ్‌కు కోర్టు చురకలు అంటించింది.

News September 30, 2024

హైడ్రా ఇదే విధంగా ముందుకు వెళ్తే స్టే ఇవ్వాల్సి వస్తుంది: హైకోర్టు

image

TG: ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయకులను ఇబ్బందులకు గురిచేస్తారా? అని హైకోర్టు ‘హైడ్రా’పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అమీన్‌పూర్ తహశీల్దార్ కోరడంతో యంత్రాలు, సిబ్బంది సమకూర్చామని రంగనాథ్ కోర్టుకు తెలిపారు. చార్మినార్ కూల్చివేతకు తహశీల్దార్ యంత్రాలు, సిబ్బంది అడిగితే ఇస్తారా? అని ప్రశ్నించింది. హైడ్రా ఇదే విధంగా ముందుకు వెళ్తే స్టే ఇవ్వాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించింది.