News January 27, 2025
ఒక్కరోజే 1.74 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానం

యూపీ ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇవాళ ఒక్కరోజే 1.74 కోట్ల మందికిపైగా భక్తులు తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు త్రివేణీ సంగమంలో స్నానమాచరించిన వారి సంఖ్య 13.21 కోట్లు దాటింది. ఈ నెల 29న మౌని అమవాస్య రోజున భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా జరగనున్న సంగతి తెలిసిందే.
Similar News
News March 14, 2025
స్టాలిన్ ప్రభుత్వంపై నిర్మల సీతారామన్ ఫైర్

తమిళనాడు బడ్జెట్ పత్రాల్లో <<15745743>>రూపీ(₹) గుర్తును<<>> తొలగించి రూ. అనే అక్షరాన్ని చేర్చడంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫైరయ్యారు. 2010లో కేంద్రం రూపీ సింబల్‌ను ఆమోదించిన సమయంలో ఎందుకు వ్యతిరేకించలేదని స్టాలిన్ సర్కారును ప్రశ్నించారు. ఇప్పుడు ఈ గుర్తును తిరస్కరించి తమిళ యువత సృజనాత్మకతను విస్మరించారని మండిపడ్డారు. కాగా రూపీ(₹) గుర్తును డిజైన్ చేసింది డీఎంకే నేత కుమారుడు ఉదయ కుమార్ కావడం గమనార్హం.
News March 14, 2025
నా కొడుకు తర్వాత సపోర్ట్ చేసేది ఆ హీరోకే: రోహిణి

నటి రోహిణి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. కొడుకు తర్వాత తాను సపోర్ట్ ఇచ్చే ఏకైక వ్యక్తి హీరో నాని అని ట్వీట్ చేశారు. ‘కోర్టు’తో ప్రేక్షకులకు ఆసక్తికర కథను ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. నాని ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే ప్రీమియర్ షోలు వేయగా మూవీని పలువురు ప్రముఖులు వీక్షించారు. కాగా రోహిణి, నాని కలిసి అలా మొదలైంది, అంటే సుందరానికి, జెంటిల్మెన్ వంటి చిత్రాల్లో నటించారు.
News March 14, 2025
మార్చి 14: చరిత్రలో ఈ రోజు

* 1879: భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ జననం
* 1883: రాజకీయ-ఆర్థికవేత్త కార్ల్ మార్క్స్ మరణం
* 1890: మలయాళ పత్రిక ‘మలయాళ మనోరమ’ సర్క్యులేషన్ ప్రారంభం
* 1918: సినీ సంగీత దర్శకుడు కేవీ మహదేవన్ జననం
* 1931: తొలి టాకీ చిత్రం ‘ఆలం ఆరా’ ముంబైలో విడుదల
* 1965: బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ జననం
* 2018: భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మరణం