News January 27, 2025
నిర్మల్: టీజీపీఎస్సీ పరీక్షా నిర్వాహకులకు ప్రశంసాపత్రాలు

నిర్మల్ జిల్లాలో టీజీపీఎస్సీ గ్రూప్స్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించినందుకు కోఆర్డినేటర్స్ డా.పీజీ రెడ్డి, డా. యూ.రవి కుమార్‌ను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అభినందించారు. వారికి గణతంత్ర వేడుకల సందర్భంగా ఉత్తమ ప్రశంసాపత్రాల్ని అందజేశారు. కాగా వీరు జీఆర్పీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో(భైంసా) హిస్టరీ, ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌గా పనిచేస్తున్నారు. కళాశాల అధ్యాపకుల బృందం వీరిని అభినందించారు.
Similar News
News November 5, 2025
యోగంలేని ఉద్యోగం నిరుపయోగం..

వివిధ సందర్భాల్లో పుట్టపర్తి సత్యసాయి బాబా చెప్పిన సూక్తులు..
★ పితృరుణం తీర్చుకోవాలంటే తిరిగి తల్లి గర్భంలో జన్మించకుండా ఉండే మార్గాన్ని కనిపెట్టాలి
★ మొహమనే నిద్రను వదిలితే సంసారమనేది స్వప్నమని తెలుస్తుంది
★ అందరిలోనూ ఆత్మతత్వం ఒక్కటే. ఇట్టి ఏకత్వాన్ని గుర్తంచిన వారికి ఎట్టి బాధలు ఉండవు
★ యోగంలేని ఉద్యోగం నిరుపయోగం, దైవచింతనయే నిజమైన యోగం, ఉద్యోగం.
News November 5, 2025
తెనాలి: ప్రైవేట్ హాస్పటల్ వైద్యురాలి ఇంట్లో భారీ చోరీ..!

తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. లాకర్ లోని ఐదు బంగారు బిస్కెట్లు, రూ. 5.50 లక్షల నగదు మాయమవడంతో త్రీ టౌన్ పోలీసులకు మంగళవారం రాత్రి ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంను రంగంలోకి దింపి ఆధారాలు సేకరిస్తున్నారు. మొత్తం రూ. 64.50 లక్షల సొత్తు చోరీ జరిగినట్లు గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 5, 2025
NTR: రాజా వారి పాట చాలా కాస్ట్ లీ గురూ..!

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ నెల 8న జరగనున్న ఇళయరాజా కచేరీకి టికెట్ల ధరలు భారీగా ఉండటం విమర్శలకు దారి తీసింది. మీట్ & గ్రీట్ కోసం రూ. 79 వేలు, ముందు వరుసలకు రూ. 59 వేల నుంచి విక్రయిస్తున్నారు. ప్రైవేట్ కార్యక్రమాల కోసం కంకర పోయడంతో గ్రౌండ్ దెబ్బతిని, క్రీడాకారులు గాయపడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవుతున్నాయని ఫిర్యాదులు అందుతున్నాయి.


