News January 27, 2025

కామారెడ్డి: ఉత్తమ లెక్చరర్‌గా వనజ

image

76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ లెక్చరర్‌గా వనజ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. కళాశాలలో వివిధ బాధ్యతల్లో విధులు సక్రమంగా నిర్వహించినందుకు గాను ఆమె అవార్డుకు ఎంపికయ్యారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో జువాలజీ విభాగంలో వనజ పని చేస్తున్నారు. అవార్డు రావడంతో కళాశాల అధ్యాపకులు అభినందించారు.

Similar News

News March 13, 2025

ఈ రోజు నమాజ్ వేళలు

image

మార్చి 13, గురువారం
ఫజర్: తెల్లవారుజామున 5.14 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.26 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.26 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.26 గంటలకు
ఇష: రాత్రి 7.38 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 13, 2025

వరంగల్ మార్కెట్లో మిర్చి ఉత్పత్తుల ధరలు ఇలా.!

image

వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో అరుదైన మిర్చి ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. దీపిక మిర్చి క్వింటాకి రూ.16,500 పలకగా, 5531 రకం మిర్చికి రూ. 11,000 ధర వచ్చింది. అలాగే 1048 మిర్చికి రూ.11 వేలు, టమాటా మిర్చికి రూ.32వేలు, సింగిల్ పట్టి మిర్చికి రూ.37000 ధర వచ్చినట్లు వ్యాపారులు పేర్కొన్నారు.

News March 13, 2025

TRAIN HIJACK: బందీలు విడుదల

image

పాకిస్థాన్ ట్రైన్ హైజాక్‌లో బందీలందరినీ సైన్యం విడిపించింది. 346 మందిని విడిపించినట్లు ప్రకటనలో పేర్కొంది. మొత్తం 33 మంది టెర్రరిస్టులను హతమార్చినట్లు తెలిపింది. ఈ క్రమంలో 28 మంది పాక్ జవాన్లు, బందీల్లో 21 మంది చనిపోయినట్లు వెల్లడించింది.

error: Content is protected !!