News January 27, 2025

ఎస్పీ వర్గీకరణ చేపట్టాలి: కడియం శ్రీహరి

image

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా మాదిగ, మాదిగ ఉప కులాలకు న్యాయం జరిగేలా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. ఆదివారం స్టే.ఘనపూర్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు, రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి, కమిషన్లు, చర్చల పేరిట కాలయాపన చేయకుండా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని, ఎస్సీ రిజర్వేషన్ 15 నుంచి 18 శాతం పెంచాలన్నారు.

Similar News

News November 14, 2025

జూబ్లీహిల్స్: జనసేన మద్దతు.. అయినా BJPకి డిపాజిట్ గల్లంతు

image

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో BJPకి డిపాజిట్ గల్లంతవడంతో ఆ పార్టీ నేతలు నిరాశలో ఉన్నారు. ఏపీలో NDA కూటమి ప్రభుత్వం ఉండడంతో ఇక్కడి ఏపీ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు జనసేన.. BJPకి మద్దతు తెలిపింది. అయినా ఆ పార్టీకి డిపాజిట్ రాలేదు. కాగా ఉపఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ మీటింగ్‌లు, ర్యాలీలలో TDP జెండాలు, చంద్రబాబు ఫొటోలు దర్శనమిచ్చాయి. తెలంగాణ TDP నేతలు కాంగ్రెస్ వైపు నిలిచారనే చర్చ కూడా కొనసాగింది.

News November 14, 2025

భద్రాద్రిని.. బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చాలి

image

భద్రాద్రి జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ పిలుపునిచ్చారు. యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో బాల్యవివాహాల నిర్మూలనకై 100 రోజుల ప్రచార ఉద్యమ గోడ పత్రికను ఆవిష్కరించారు. బాల్యవివాహాలు లేని జిల్లాగా భద్రాద్రిని నిలపాలన్నారు. బాల్య వివాహ రహిత జిల్లాగా తెలంగాణలో కీర్తికెక్కెలా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు.

News November 14, 2025

జూబ్లీహిల్స్: జనసేన మద్దతు.. అయినా BJPకి డిపాజిట్ గల్లంతు

image

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో BJPకి డిపాజిట్ గల్లంతవడంతో ఆ పార్టీ నేతలు నిరాశలో ఉన్నారు. ఏపీలో NDA కూటమి ప్రభుత్వం ఉండడంతో ఇక్కడి ఏపీ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు జనసేన BJPకి మద్దతు తెలిపింది. అయినా ఆ పార్టీకి డిపాజిట్ రాలేదు. కాగా ఉపఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ మీటింగ్‌లు, ర్యాలీలలో TDP జెండాలు, చంద్రబాబు ఫొటోలు దర్శనమిచ్చాయి. తెలంగాణ TDP నేతలు కాంగ్రెస్ వైపు నిలిచారనే చర్చ కూడా కొనసాగింది.