News January 27, 2025
శంబర జాతరకు వెళ్లే భక్తులకు అలెర్ట్

శంబర పోలమాంబ జాతర రద్దీ దృష్ట్యా ఆటోలు, ఫోర్ వీలర్ వాహనాలను కవిరిపల్లి మీదుగా శంబర అనుమతి లేదని మక్కువ ఎస్ఐ M. వెంకటరమణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ద్విచక్ర వాహనాలను మాత్రమే కవిరిపల్లి మీదుగా అనుమతించడం జరుగుతుందని అన్నారు. ఆటోలు, ఫోర్ వీలర్ వాహనాదారులు చెముడు మీదుగా శంబర చేరుకోవాలని ఆయన సూచించారు.
Similar News
News January 18, 2026
ఏకైక డైరీ కళాశాల కామారెడ్డిలోనే

తెలంగాణ రాష్ట్రంలో ఏకైక డైరీ టెక్నాలజీ కళాశాల కామారెడ్డిలో మాత్రమే ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గుర్తు చేశారు. ఆదివారం డైరీ టెక్నాలజీ కళాశాలలో రూ.35 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైయస్ రాజశేఖరరెడ్డి రెండు డైరీ కళాశాలలు మంజూరు చేశారన్నారు. అందులో ఒకటి కామారెడ్డిలో ఏర్పాటు చేశారన్నారు.
News January 18, 2026
మేడారంలో మంత్రులతో సీఎం ఫొటో

మేడారం పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులతో కలిసి ప్రత్యేకంగా ఫొటోలు దిగారు. చారిత్రాత్మక క్యాటినెట్ భేటీ నిమిత్తం హరిత హోటల్‌కు చేరుకున్న సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో కలిసి ఆయన ఫొటోలు దిగారు. మంత్రులందరూ ఒకేచోట చేరి ఉత్సాహంగా కనిపించడంతో మేడారంలో పండగ వాతావరణం నెలకొంది.
News January 18, 2026
శ్రీకాళహస్తి: కూటమి నేతలు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదా…?

YCP హయాంలో <<18891289>>ఈ స్థలాన్ని<<>> ఆక్రమించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆక్రమణ చేసిన భూములను వెనక్కి తీసుకోవాలని కొందరు TDP నేతలు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారట. అయినా వారు పట్టించుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. కబ్జా చేసిన స్థలంలో నిర్మించిన గదుల్లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయని సమాచారం. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వ భూమి ప్రైవేట్ పరం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.


