News January 27, 2025

31న టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం

image

ఈనెల 31న TTD పాలక మండలి అత్యవసర సమావేశం జరగనుందని TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు X వేదికగా తెలిపారు. రథసప్తమి ఏర్పాట్లపై సభ్యులు, అధికారులతో క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. జనవరి 8న‌ తిరుపతి తోపులాట ఘటనను దృష్టిలో ఉంచుకొని అధికారులు పటిష్ఠమైన ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. ఫిబ్రవరి 4న పలు ఆర్జిత సేవలు, సిఫార్సు లేఖలపై విఐపీ బ్రేక్ దర్శనాలు, అన్ని ప్రివిలైజ్ దర్శనాలను రద్దు చేసింది.

Similar News

News July 7, 2025

జూబ్లీహిల్స్‌ కోసం దండయాత్ర!

image

జూబ్లీహిల్స్‌ కోసం రాజకీయ పార్టీలే కాదు ఉద్యమకారులు దండయాత్రకు సిద్ధమయ్యారు. తమకు న్యాయం చేయకపోతే ఉప ఎన్నికలో పోటీ చేస్తామని INCని హెచ్చరించారు. ఓ వైపు TDP వ్యూహం రచిస్తోంది. తాను పోటీలో ఉంటానని యుగ తులసి పార్టీ అధ్యక్షుడు శివకుమార్ ప్రకటించారు. ఇక ఇండిపెండెంట్లు ఎంతమంది వస్తారో తెలియని పరిస్థితి. ప్రధాన పార్టీలైన INC, BRS, BJP గెలుపు కోసం సర్వ శక్తులు ఒడ్డాల్సిన పరిస్థితి నెలకొంది.

నెల్లూరు: ప్రార్థనల అనంతరం మీ దారెటు.?

image

నెల్లూరులో బారాషాహీద్ దర్గా వద్ద రొట్టెల పండగ ప్రారంభమైన విషయం తెలిసింది. ఇప్పటికే అధిక సంఖ్యలో భక్తులు నెల్లూరుకు చేరుకున్నారు. ప్రతి ఏడాది ప్రత్యేక ప్రార్థనల అనంతరం భక్తులు జిల్లాలోని పలు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలకు వెళ్తారు. వాటిలో ముఖ్యమైనవి:
☞ ఏఎస్ పేట దర్గా ☞ కసుమూరు దర్గా ☞ సోమశిల ప్రాజెక్టు
☞ మైపాడు బీచ్ ☞ పెంచలకోన ☞ కండలేరు రిజర్వాయర్ ☞ ఉదయగిరి కోట
మీరు ఎక్కడికి వెళ్తున్నారు.?