News January 27, 2025

SKLM: ఆదిత్యుని ఒక్కరోజు ఆదాయం

image

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామికి ఒక్క రోజు వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. వారికి టికెట్లు రూపేనా రూ.49,500, పూజలు, విరాళాల రూపంలో రూ.50,074, ప్రసాదాల రూపంలో రూ.96,565 స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారని ఈవో చెప్పారు.

Similar News

News January 21, 2026

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

రోడ్లు లేని గ్రామాలు ఉండవు: అచ్చెన్న
రథసప్తమి ఏర్పాట్లు పరిశీలనలో ఎమ్మెల్యే గొండు శంకర్
చేనేత కార్మికుల వృద్ధికి కృషిచేస్తాం: ఎమ్మెల్యే గోవిందరావు
శ్రీకాకుళం: ఆలయాల భద్రత పై ప్రత్యేక దృష్టి
సామాన్య భక్తులకు ప్రాధాన్యత: అరసవల్లి ఈఓ
భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి: హోంమంత్రి అనిత
కేంద్ర రక్షణ మంత్రిని కలిసిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు

News January 21, 2026

SKLM: తమన్ మ్యూజికల్ షో‌కు పగడ్బందీ ఏర్పాట్లు

image

తమన్ మ్యూజికల్ షోకు పగడ్బందీగా బారికేడ్లు నిర్మించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఎస్సీ కేవీ మహేశ్వర్ రెడ్డితో కలిసి స్థలాన్ని పరిశీలించారు. ప్రేక్షకులు వేలాది సంఖ్యలో వచ్చే పరిస్థితి ఉన్నందున తగిన జాగ్రత్తలు కింది స్థాయి అధికారులకు సూచించారు. వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని, ప్రవేశ, నిష్క్రమణ గేట్లు సక్రమంగా ఉండాలన్నారు.

News January 21, 2026

వినతులు స్వీకరించిన అచ్చెన్న

image

ప్ర‌జ‌ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కొన్ని సమస్యలను అక్కడికక్కడే సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా మాట్లాడాలని పరిష్కరించాలని ఆదేశించారు. మరికొన్ని సమస్యలను సంబంధిత శాఖలకు సిఫారసు చేశారు.