News January 27, 2025

పథకాల అమలుకు చొరవ తీసుకుంటా: భూపాలపల్లి కలెక్టర్

image

జిల్లాలో పథకాల అమలుకు పత్యేక చొరవ తీసుకుంటామని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. పేదలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16 నుంచి 20 వరకు నాలుగు సంక్షేమ పథకాల కోసం క్షేత్రస్థాయి విచారణ నిర్వహించిందన్నారు. సంక్షేమ పథకాలు అమలు అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు.

Similar News

News November 10, 2025

అందెశ్రీకి తీవ్ర అస్వస్థత

image

తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ రచయిత అందెశ్రీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

News November 10, 2025

GNT: క్రికెట్ బ్యాట్‌తో కొట్టి.. భార్య చంపిన భర్త.!

image

రియల్ ఎస్టేట్ వ్యాపారి.. క్రికెట్ బ్యాటుతో కొట్టి తన భార్యను హతమార్చిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. గుంటూరు జిల్లా వాసులైన సి.బ్రహ్మయ్య-కృష్ణవేణి దంపతులు అమీన్‌పూర్‌లోని కేఎస్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. కృష్ణవేణి ఓ బ్యాంక్‌లో పనిచేస్తున్నారు. ఇరువురు దంపతులకు ఒకరిపై ఒకరికి అనుమానాలు ఉండగా..భార్యతో గొడవ పడిన బ్రహ్మయ్య బ్యాటుతో కొట్టాడు. దీంతో ఆమె అక్కడే ప్రాణాలు విడిచింది.

News November 10, 2025

ప్రకృతి సేద్యం.. బ్రహ్మాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు

image

ప్రకృతి సేద్యంలో పెద్ద పురుగులు, చీడపీడల నివారణకు బ్రహ్మాస్త్రాన్ని రైతులు ఉపయోగిస్తున్నారు. బ్రహ్మాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ దేశవాళీ ఆవు లేదా నాటు ఆవు మూత్రం – 10 లీటర్లు
☛ వేప ఆకులు – 2 కిలోలు
☛ సీతాఫలం ఆకులు – 2 కిలోలు
☛ పల్లేరు(బిల్వపత్రం) ఆకులు – 2 కిలోలు
☛ ఉమ్మెత్త ఆకులు – 2 కిలోలు అవసరం.