News January 27, 2025

ఉప్పలగుప్తం: స్నేక్ క్యాచర్ గణేశ్ వర్మకు పురస్కారం

image

గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ హోదాలలో పని చేస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రతి గ్రామంలో పాములను సంరక్షణ చేస్తూ ప్రజలను కాపాడుతూ సమాజ సేవ చేస్తున్న ఉప్పలగుప్తం మండలం భీమనపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ గణేశ్ వర్మ కలెక్టర్ మహేశ్ కుమార్ చేతులు మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా గణేశ్ వర్మను పలువురు అభినందించారు.

Similar News

News March 1, 2026

దౌత్యమే కాపాడింది.. ఆ ఒక్క గల్ఫ్ దేశం సేఫ్!

image

US, ఇజ్రాయెల్‌‌పై ప్రతీకార దాడుల్లో భాగంగా గల్ఫ్ దేశాలపైన విరుచుకుపడుతున్న ఇరాన్ ఒమన్‌ను మాత్రం విడిచిపెట్టింది. దౌత్యంలో US, ఇరాన్‌లకు ఒమన్ సమాన ప్రాధాన్యం ఇవ్వడమే కారణం. గతంలో పలు సందర్భాల్లో ఇరు దేశాలకు ఒమన్ మధ్యవర్తిగా పనిచేసింది. దీంతో పాటు ఒమన్‌‌లో US స్థావరం లేదు. మరోవైపు బహ్రయిన్, కువైట్, ఖతార్, UAE, సౌదీ USకు మద్దతు ఇస్తున్నాయి. కాగా ఒమన్‌లో దాదాపు 9లక్షల మంది భారతీయులు ఉన్నారు.

News March 1, 2026

బిచ్కుంద: 24 గంటల్లోనే హత్య కేసు నిందితుడి అరెస్ట్

image

భూ తగాదాల నేపథ్యంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. బిచ్కుంద CI రవి తెలిపిన వివరాలు.. బిచ్కుందకు చెందిన సాయిలు, అతని సోదరుడు నారాయణ మధ్య కొంతకాలంగా భూ వివాదాలు నడుస్తున్నాయి. ఆగ్రహానికి లోనైన నారాయణ సాయిలు తలపై కర్రతో బలంగా బాదాడు. తీవ్ర గాయాలైన సాయిలు అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు నారాయణను పట్టుకొని, హత్యకు వాడిన కర్రను స్వాధీనం చేసుకున్నట్లు CI వెల్లడించారు. SI రాజు ఉన్నారు.

News March 1, 2026

నిజామాబాద్ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు

image

నిజామాబాద్ మీదుగా వెళ్లే పలు రైళ్లు నిర్వహణ పనుల కారణంగా పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు తెలిపారు. మార్చి 7వ తేదీ వరకు రద్దు చేశారు. కాచిగూడ – నిజామాబాద్ (77601), నిజామాబాద్ – కాచిగూడ (77602), నిజామాబాద్ – నాందేడ్ (77645), నాందేడ్ – నిజామాబాద్ (77646) రైళ్లు రద్దయ్యాయి.