News January 27, 2025

పాతబస్తి మెట్రో కోసం.. భగాయత్ లేఅవుట్ల వేలం..!

image

HYD ఉప్పల్ భగాయత్ లేఅవుట్ వద్ద ఓపెన్ ప్లాట్ల వేలం ద్వారా నిధులు సమీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నిధులను MGBS నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మించే 7.5KM పాతబస్తీ మెట్రో కారిడార్ నిర్మాణానికి వినియోగించే అవకాశం ఉంది. మరోవైపు, ఈ మెట్రో మార్గంలో ఉండే సుమారు 100 మత, వారసత్వ, సున్నిత నిర్మాణాలను పరిరక్షించేందుకు మెట్రో రైలు సంస్థ ఇంజనీరింగ్ పరిష్కారాలను డెవలప్ చేసింది.

Similar News

News September 13, 2025

రంగారెడ్డి: ఈనెల 15న జిల్లా కబడ్డీ జట్టు ఎంపిక

image

రంగారెడ్డి జిల్లా సబ్ జూనియర్ కబడ్డీ బాల, బాలికల జట్ల ఎంపిక ఈ నెల 15న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరగనుంది. జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు రవికుమార్ మాట్లాడుతూ.. ఎంపికైన క్రీడాకారులు నిజామాబాద్ జిల్లాలో జరిగే అంతర్ జిల్లా కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. 55 కిలోల బరువు లోపు ఉన్న క్రీడాకారులు మాత్రమే ఈ ఎంపికకు అర్హులని పేర్కొన్నారు.

News September 13, 2025

‘గాంధీ ఆసుపత్రిని మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా’

image

గాంధీ ఆసుపత్రిని మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని నూతన సూపరింటెండెంట్ డాక్టర్ వాణి అన్నారు. శుక్రవారం ఆమె బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడారు. ఆసుపత్రిలో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని పూర్తిగా పరిశీలించి, పరిస్థితులను మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

News September 13, 2025

దిల్‌సుఖ్‌నగర్: ఆర్టీసీ ‘యాత్రాదానం’

image

టీజీఎస్ఆర్టీసీ ‘యాత్రాదానం’ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిందని హైదరాబాద్-2 డిపో మేనేజర్ కృష్ణమూర్తి తెలిపారు. అనాథలు, వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులకు పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు ఉచిత యాత్రలు కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమానికి దాతలు, కార్పొరేట్ సంస్థలు, ప్రజాప్రతినిధులు విరాళాలు అందించి భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.