News January 27, 2025

MHBD: మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులు

image

రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాలిటీ పాలకవర్గాల గడువు నేటితో ముగిసింది. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని మహబూబాబాద్, డోర్నకల్, మరిపెడ, తొర్రూరు మున్సిపాలిటీలకు ప్రత్యేక పాలనాధికారిగా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్‌ను నియమించారు. కొత్త పాలకవర్గం కొలువు తీరేవరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుందని సర్కులర్ జారీ చేశారు.

Similar News

News September 18, 2025

తగ్గిన బంగారం ధరలు!

image

బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.540 తగ్గి రూ.1,11,170కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.500 పతనమై రూ.1,01,900 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.1,000 తగ్గి రూ.1,41,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News September 18, 2025

పామిడిలో తండ్రిని చంపిన కొడుకు

image

పామిడిలోని బెస్తవీధిలో తండ్రిపై కొడుకు రోకలి బండతో దాడి చేశాడు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి జరిగింది. దాడిలో తండ్రి సుధాకర్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 18, 2025

సిరిసిల్ల కలెక్టర్‌పై వారెంట్ జారీ..!

image

సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ సందీప్ కుమార్ ఝాపై హైకోర్టు వారెంట్ జారీ చేసినట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది బొమ్మన అర్జున్ తెలిపారు. ఏమైందంటే.. మిడ్ మానేరులో ఇంటిని కోల్పోయిన చీర్లవంచకు చెందిన వేల్పుల ఎల్లయ్య నష్టపరిహారం కోసం హైకోర్టును ఆశ్రయించాడు. అతడికి పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించినా దీనిపై కలెక్టర్ ఉదాసీనంగా వ్యవహరించారు. పైగా వివరణ కోసం కోర్టుకూ హాజరుకాలేదు. దీంతో ఆయనపై వారెంట్ జారీ అయింది.