News January 27, 2025

గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు: కడియం కావ్య

image

గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డుల సంక్షేమ పథకాల మంజూరు పత్రాలను ఆమె లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News January 15, 2026

అన్నమయ్య జిల్లాలో కొర్రమీను పెంపకం.. లాభాలమయం..!

image

అన్నమయ్య జిల్లాలో PMDDKY పథకం కింద ఫామ్‌పాండ్‌ల ఆధారంగా (ముర్రెల్)‌ కొర్రమీను పెంపకం విజయవంతంగా సాగుతోంది. కిలోకు రూ.300 – రూ.500 వరకు లభించడంతో లాభాలు వస్తున్నాయి. శాస్త్రీయ పద్ధతులతో ఒక్క సైకిల్‌లో 0.5 నుంచి 1 టన్ను వరకు ఉత్పత్తి వస్తోంది. ఉద్యానవన పంటలతోపాటు చేపల సాగు చేపడితే ఒక్క పంటకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు నికర ఆదాయం లభిస్తుందని డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇండియా పేర్కొంది.

News January 15, 2026

బీసీలకు 42% సీట్లు.. పార్టీలు ఇచ్చేనా?

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో SC ఆదేశాలతో రిజర్వేషన్లు 50% మించకుండా అమలు చేశారు. BCలకు 42% స్థానాలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్, BRSకు ఇదో అవకాశంగా ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో 32%(38 స్థానాలు) కార్పొరేషన్‌లో 30%(3 చోట్ల) కేటాయించింది. కాగా హామీని నెరవేర్చేందుకు మరో 12 మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలోనూ BC అభ్యర్థులనే ప్రకటించాల్సి ఉంది. మరి పార్టీలు ఎలాంటి ప్రకటన చేస్తాయో చూడాలి.

News January 15, 2026

గజ్వేల్: KCR ఫాంహౌస్‌లో సంక్రాంతి సంబరాలు

image

సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో మాజీ ముఖ్యమంత్రి KCR తన కుటుంబంతో కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. సంక్రాంతి సందర్భంగా ఆయన సతీమణి శోభ, కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు కోడలు, మనవడు, మనవరాలితో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.