News January 27, 2025
తిలక్ వర్మ ఇంకా సూపర్‌స్టార్ కాదు: మాజీ క్రికెటర్
టీమ్ ఇండియా క్రికెటర్ తిలక్ వర్మ సూపర్ స్టార్ అని కొందరు అంటున్నారని, కానీ ఆయన ఇంకా సూపర్ స్టార్ కాలేదని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు. కానీ ఆవైపుగా ఆయన జర్నీ కొనసాగుతోందని చెప్పారు. ‘భారత్‌కు నమ్మకమైన మిడిలార్డర్ బ్యాటర్‌గా తిలక్ సత్తా చాటుతున్నారు. జట్టును కష్టాల్లోనుంచి బయటపడేస్తూ సూపర్ స్టార్‌గా ఎదుగుతున్నారు. అతని నిబద్ధత, నిలకడతో రాటుదేలుతున్నారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News January 29, 2025
గాజాకు చేరుకున్న 3 లక్షల మంది పాలస్తీనియన్లు
15 నెలల తర్వాత 3 లక్షల మందికిపైగా పాలస్తీనియన్లు గాజాకు చేరుకున్నారు. ధ్వంసమైన శిథిలాల్లోనే తాత్కాలిక ఆశ్రయాలు ఏర్పాటు చేసుకున్నారు. రాళ్లు రప్పల మధ్య మళ్లీ మొదటి నుంచి బతికేందుకు వారు సిద్ధమయ్యారు. గాజాకు వంట గ్యాస్ డెలివరీ కూడా అందుబాటులోకి వచ్చినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. మరోవైపు వైట్‌హౌస్‌కు రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఆహ్వానం పంపారు.
News January 29, 2025
ఆర్జీవీకి ఒంగోలు పోలీసుల నోటీసులు
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు మరోసారి ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు పంపారు. ఫిబ్రవరి 4న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టడంపై ఆర్జీవీకి ఈ నోటీసులు పంపారు. కాగా గతంలోనూ ఆర్జీవీకి పోలీసులు సమన్లు అందించారు. కానీ విచారణకు హాజరు కాలేనంటూ తన న్యాయవాదులతో సమాచారం పంపారు.
News January 29, 2025
వచ్చే నెల 1న తూ.గో జిల్లాకు చంద్రబాబు
AP: ఫిబ్రవరి 1న సీఎం చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. కొవ్వూరు మండలం దొమ్మేరులో సీఎం పెన్షన్లు పంపిణీ చేస్తారు. అనంతరం అదే గ్రామంలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. స్థానిక ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. పింఛన్లు, ఇంటి స్థలాలు, సొంతిళ్ల గురించి వారితో చర్చించే అవకాశం ఉంది. అనంతరం తిరిగి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.