News January 27, 2025

ADB జిల్లా వాసికి జీవనసాఫల్య పురస్కారం 

image

ఇచ్చోడ మండలం బోరిగామ గ్రామానికి చెందిన ఐఎఫ్ఎస్ అధికారి గోపిడి చంద్రశేఖర్ రెడ్డి  జీవన సాఫల్య పురస్కరానంని అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, సుస్థిరతకు చేసిన విశిష్ట సేవలు, పచ్చదనం, పర్యావరణ వ్యవస్థను పెంపొందించడమే కాకుండా పలు కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయనకు పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నట్లు రాజ్‍భవన్ తెలిపింది.

Similar News

News September 19, 2025

కరీంనగర్: చెత్త వేయకుండా ఇనుప జాలి ఏర్పాటు

image

కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియం, బస్టాండ్ వెనుక రోడ్డులో ప్రజలు చెత్త వేయకుండా మున్సిపల్ అధికారులు ఇనుప జాలిని ఏర్పాటు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయవద్దని అధికారులు పదేపదే సూచించినా ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నారు. నగర పరిశుభ్రతను కాపాడటానికి అందరూ సహకరించాలని అధికారులు కోరారు.

News September 19, 2025

శంకరపట్నం: యాదవ్ చైతన్య వేదిక జిల్లా ఉపాధ్యక్షుడిగా ఐలయ్య యాదవ్

image

శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన గుండెవేని ఐలయ్య యాదవ్‌ను యాదవ చైతన్య వేదిక జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించినట్లు రాష్ట్ర యాదవ చైతన్య వేదిక అధ్యక్షులు గొర్ల ఐలేష్ యాదవ్ తెలిపారు. శంకరపట్నం మండల కేంద్రంలో ఈ నియమకం జరిగినట్లు చెప్పారు. జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు గొర్ల ఐలేష్ యాదవ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాజయ్యలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

News September 19, 2025

IT కోర్ సెంటర్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించిన SP

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో SP హర్షవర్ధన్ రాజు గురువారం IT కోర్ సెంటర్, కంట్రోల్ రూమ్ సెంటర్లను సందర్శించారు. సిబ్బంది పని తీరు, విధులపై ఆరా తీశారు. CCTNS, CDR, సైబర్ క్రైమ్ అప్డేట్స్, అప్లికేషన్లపై సిబ్బందితో చర్చించారు. పలు ఫైల్స్ పరిశీలించారు. పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల దర్యాప్తునకు ఉపయోగపడే ఆధారాలను త్వరితగతిన అందించాలన్నారు.