News January 27, 2025
మల్యాల: ఉపాధ్యాయురాలు ఆకస్మిక మరణం

మల్యాల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్ గా విధులు నిర్వహిస్తున్న మమత (30) ఆదివారం ఆకస్మిక మరణం చెందారు. పెగడపల్లి మండలం దోమలకుంటకు చెందిన మమత మల్యాలలోని మణికంఠ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. అనారోగ్యంతో ఈ నెల 24న జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ రోజు ఆరోగ్య సమస్య తీవ్రం కావడంతో హైదరాబాద్ తరలిస్తుండగా మరణించినట్లు సమాచారం. మృతురాలికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు.
Similar News
News September 19, 2025
అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ RRR అసహనం

2వ రోజు అసెంబ్లీ సమావేశాలలో డిప్యూటీ స్పీకర్ RRR అసహనం వ్యక్తం చేశారు. అనకాపల్లి MLA కొణతాల రామకృష్ణ గళం వినిపిస్తుండగా .. విప్‌లు మాట్లాడుకుంటూ ఉండడాన్ని తప్పుబట్టారు. విప్‌లు కాస్త మాటలు తగ్గించాలన్నారు. అత్యవసరమైతే బయటికి వెళ్లిపోవాలని సూచించారు. అలా కాదని సభలో గందరగోళం సృష్టిస్తూ అంతరాయం కలిగించవద్దని మనవి చేశారు.
News September 19, 2025
ఇది కదా అసలైన మార్పంటే.. హరీశ్ రావు సెటైర్

TG: తాము మేడిగడ్డ-మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు ₹84వేల కోట్లు వెచ్చిస్తే కాంగ్రెస్ తమ్మిడిహట్టి-ఎల్లంపల్లికి ₹35వేల కోట్లు కేటాయించిందని హరీశ్‌రావు విమర్శించారు. ‘కాళేశ్వరంతో 37లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలనేది లక్ష్యమైతే, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుతో కేవలం 4.47లక్షల ఎకరాలకే సాగు నీరట! ₹35వేల కోట్లతో కేవలం 4.47లక్షల ఎకరాలకు నీరివ్వాలనే ఆలోచన అద్భుతం. ఇది కదా అసలైన మార్పంటే?’ అని హరీశ్ సెటైర్ వేశారు.
News September 19, 2025
వారంలో మూడు రోజులు ముచ్చింతల్‌కు బస్సులు

ఆధ్యాత్మిక కేంద్రం ముచ్చింతల్‌కు వెళ్లేందుకు ఆర్టీసీ అధికారులు బస్సులు ఏర్పాటు చేశారు. ఈ నెల 20 నుంచి శుక్ర, శని, ఆదివారాల్లో బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. JBS, ఆఫ్జల్‌గంజ్, సికింద్రాబాద్, KPHB, ఉప్పల్, రిసాలాబజార్ ప్రాంతాల నుంచి బస్సులు నడుపుతామన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ సౌకర్యం ఉంటుందని వివరించారు.