News March 18, 2024
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షం వివరాలు..

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఏడబ్ల్యూఎస్ స్టేషన్లో ఉ. 8:30 గంటలకు నమోదైన వర్షపాతం వివరాలు.. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లాలో నాగల్ గిద్ద, సత్వార్ 34.5, ముక్తార్ 32.8, కంగ్టి 22.8, మొగుడంపల్లి 10.8, మనూర్ 8.5, సిద్దిపేట జిల్లాలో వెంకట్రావుపేట 5.8, కోహెడ 2.5, గండిపల్లి 2.0, మెదక్ జిల్లాలో కౌడిపల్లి 1.8, రేగోడ్ 1.5, పాతూరు 1.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Similar News
News January 25, 2026
మెదక్ పోలీస్ కార్యాలయం త్రివర్ణ శోభితం

గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో జిల్లా పోలీస్ కార్యాలయం శనివారం రాత్రి విద్యుత్ దీపాల అలంకరణతో త్రివర్ణమయంగా మారింది. ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు పర్యవేక్షణలో పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఈ వేడుకలకు కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు అధికారులు పరేడ్ గ్రౌండ్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
News January 24, 2026
MDK: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

బైక్ నియంత్రణ తప్పి కింద పడటంతో తలకు తీవ్ర గాయాలై యువకుడు మృతి చెందినట్లు హవేలిఘనపూర్ ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. దూప్ సింగ్ తండాకు చెందిన సుభాష్(34) మెదక్ నుంచి ఇంటికి వస్తుండగా శివారులో ఈ ప్రమాదం జరిగింది. చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా, అక్కడ కోలుకోలేక మరణించాడు. కుటుంబంలో చేతికి వచ్చిన కొడుకు మృతి చెందడంతో తండాలో విషాదం నెలకొంది.
News January 23, 2026
సైన్స్ ఫెయిర్లో మెదక్ జిల్లాకు 3 బహుమతులు

సంగారెడ్డి జిల్లా కొల్లూరులో జరిగిన దక్షిణ భారత స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో మెదక్ జిల్లా ప్రతిభ చాటిందని డిఈఓ విజయ తెలిపారు. టీచర్ ఎగ్జిబిట్ విభాగంలో కొడపాక జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుడు వెంకటరమణ ప్రథమ స్థానం సాధించారు. విద్యార్థుల విభాగంలో తూప్రాన్ గీత స్కూల్ విద్యార్థిని మహతి 3వ స్థానం, సిద్ధార్థ రూరల్ స్కూల్ విద్యార్థి అక్షయ్ 4వ స్థానంలో నిలిచారు. విజేతలను డిఈఓ అభినందించారు.


