News January 27, 2025

పాతబస్తి మెట్రో కోసం.. భగాయత్ లేఅవుట్ల వేలం..!

image

HYD ఉప్పల్ భగాయత్ లేఅవుట్ వద్ద ఓపెన్ ప్లాట్ల వేలం ద్వారా నిధులు సమీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నిధులను MGBS నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మించే 7.5KM పాతబస్తీ మెట్రో కారిడార్ నిర్మాణానికి వినియోగించే అవకాశం ఉంది. మరోవైపు, ఈ మెట్రో మార్గంలో ఉండే సుమారు 100 మత, వారసత్వ, సున్నిత నిర్మాణాలను పరిరక్షించేందుకు మెట్రో రైలు సంస్థ ఇంజనీరింగ్ పరిష్కారాలను డెవలప్ చేసింది.

Similar News

News February 24, 2026

NLG: గృహలక్ష్మి లబ్ధిదారులకు ‘ఇందిరమ్మ’ ఊరట

image

గత ప్రభుత్వ హయాంలో గృహలక్ష్మి పథకం కింద బేస్‌మెంట్ స్థాయి వరకు ఇళ్లు నిర్మించుకుని, నిధులు అందక నిలిచిపోయిన లబ్ధిదారులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. వీరిని ఇందిరమ్మ ఇళ్ల పథకంలోకి మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది. బేస్‌మెంట్ వరకు కట్టిన వారికి లక్ష రూపాయలు మినహాయించి, మిగిలిన నాలుగు లక్షల రూపాయలను ప్రభుత్వం చెల్లించనుంది.నల్గొండ జిల్లాలో 150 మందికి ఈ అవకాశం కల్పించారు.

News February 24, 2026

కైకలూరు: సచివాలయ సిబ్బందిపై దాడి.. పోలీసులకు ఫిర్యాదు

image

కైకలూరు మండలం పందిరిపల్లిగూడెంలో ఏకీకృత కుటుంబ సర్వే చేస్తున్న సచివాలయ సిబ్బందిపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 21న సర్వే చేస్తుండగా.. మా వివరాలు మీకెందుకు చెప్పాలని గ్రామస్థుడు బలే సాయికుమార్‌ తమపై దాడిచేసినట్లు సిబ్బంది టి.సురేశ్, సీహెచ్ గోపాలకృష్ణలు ఆరోపించారు. ఈ మేరకు సాయికుమార్‌పై రూరల్ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

News February 24, 2026

సంతానలేమికి ముందే హెచ్చరికలు

image

సంతానలేమితో బాధపడే మహిళల్లో రజస్వల నాటి నుంచే కొన్ని హెచ్చరిక సంకేతాలు కనిపిస్తుంటాయంటున్నారు నిపుణులు. నెలసరి సక్రమంగా రాకపోవడం, ఎక్కువరోజులు బ్లీడింగ్ కావడం, కొందరు 18 ఏళ్లు వచ్చినా అసలు రజస్వలే కాకపోవడం వంటివి గమనించాలి. ఊబకాయం, అవాంఛిత రోమాలు మొలవటం, విడవకుండా మొటిమలు వేధించటం, తీవ్రమైన కడుపునొప్పి వంటివీ ఉండొచ్చు. వీటిని రక్త పరీక్షలు, స్కానింగ్‌తో గుర్తించొచ్చు.