News January 27, 2025
గవర్నర్, కేంద్ర మంత్రికి తప్పిన ప్రమాదం
TG: హుస్సేన్ సాగర్‌లో చేపట్టిన ‘భరతమాతకు మహా హారతి’ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రమాదం తప్పింది. కార్యక్రమం పూర్తైన వెంటనే ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయిన వెంటనే చివరి అంకంగా బాణసంచా పేల్చగా పడవల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బందికి గాయాలయ్యాయి. నలుగురు ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
Similar News
News January 29, 2025
పవన్ తనయుడితో సినిమా.. డైరెక్టర్ ఏమన్నారంటే?
పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘పంజా’ చిత్రం అనుకున్నంతగా ఆకట్టుకోకపోయినా విష్ణు వర్ధన్ డైరెక్షన్‌కు మంచి మార్కులు పడ్డాయి. పవన్‌ను స్టైలిష్‌గా చూపించారని అభిమానులు ఖుషీ అయ్యారు. తాజాగా పవన్ తనయుడు అకీరా నందన్‌తో పంజా సీక్వెల్ తీస్తారా? లేదా వేరే మూవీ తీస్తారా అన్న మీడియా ప్రశ్నకు విష్ణు బదులిచ్చారు. దేనికైనా టైమ్ రావాలని, అవకాశం వస్తే తప్పక మూవీ చేస్తానని ‘ప్రేమిస్తావా’ ఈవెంట్‌లో చెప్పారు.
News January 29, 2025
గాజాకు చేరుకున్న 3 లక్షల మంది పాలస్తీనియన్లు
15 నెలల తర్వాత 3 లక్షల మందికిపైగా పాలస్తీనియన్లు గాజాకు చేరుకున్నారు. ధ్వంసమైన శిథిలాల్లోనే తాత్కాలిక ఆశ్రయాలు ఏర్పాటు చేసుకున్నారు. రాళ్లు రప్పల మధ్య మళ్లీ మొదటి నుంచి బతికేందుకు వారు సిద్ధమయ్యారు. గాజాకు వంట గ్యాస్ డెలివరీ కూడా అందుబాటులోకి వచ్చినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. మరోవైపు వైట్‌హౌస్‌కు రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఆహ్వానం పంపారు.
News January 29, 2025
ఆర్జీవీకి ఒంగోలు పోలీసుల నోటీసులు
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు మరోసారి ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు పంపారు. ఫిబ్రవరి 4న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టడంపై ఆర్జీవీకి ఈ నోటీసులు పంపారు. కాగా గతంలోనూ ఆర్జీవీకి పోలీసులు సమన్లు అందించారు. కానీ విచారణకు హాజరు కాలేనంటూ తన న్యాయవాదులతో సమాచారం పంపారు.