News March 18, 2024
కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయి: PM మోదీ
కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్, BRS కుమ్మక్కయ్యాయని PM మోదీ అన్నారు. ‘BRS ప్రజలను దోచుకుంది. లిక్కర్ స్కామ్‌లోనూ కమీషన్లు తీసుకుంది. ఆ పార్టీ చేసిన అవినీతిపై కాంగ్రెస్ దర్యాప్తు చేయడం లేదు. దేశాన్ని దోచుకునేందుకే కుటుంబ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయి. తెలంగాణను కాంగ్రెస్ ATMగా మార్చుకుంది. రాష్ట్ర ప్రజల డబ్బు ఇప్పుడు ఢిల్లీ చేరుతోంది. తెలంగాణను దోచుకున్న వారిలో ఎవరినీ వదిలిపెట్టం’ అని పేర్కొన్నారు.
Similar News
News December 28, 2024
లైంగిక వేధింపులు.. నటుడు అరెస్ట్
లైంగిక వేధింపుల కేసులో కన్నడ బుల్లితెర నటుడు చరిత్ బాలప్పను BNGL పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో మోసం చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. డబ్బులు ఇవ్వాలని వేధించేవాడని, ప్రైవేట్ వీడియోలు లీక్ చేస్తామని బెదిరించాడని ఆమె పేర్కొంది. ఇతను కన్నడలో పాపులర్ ‘ముద్దులక్ష్మీ’తోపాటు తెలుగులో పలు సీరియళ్లలో నటించాడు. గతంలో నటి మంజును పెళ్లాడి విడాకులు తీసుకున్నాడు.
News December 28, 2024
స్టాక్స్‌కు దూరం.. FDలకే మన్మోహన్ మొగ్గు
ఆర్థికవేత్తగా తన సంస్కరణలతో దేశాన్ని ముందుకు నడిపించిన మన్మోహన్ సింగ్ స్టాక్‌మార్కెట్‌కి ఎప్పుడూ దూరంగా ఉండేవారు. అందులో ఒడిదుడుకులతో నిద్ర కోల్పోవడం తనకు ఇష్టం లేదని 1992లో పార్లమెంటులో ఆయన చెప్పారు. తన డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్‌లో మాత్రమే పెట్టేవారు. 2019 నాటికి ఆయన మొత్తం ఆస్తి విలువ రూ.15కోట్లు. అందులో FDల్లో రూ.7 కోట్లు, పోస్టాఫీస్‌లో రూ.12 లక్షలు ఉంది.
News December 28, 2024
నేడు మన్మోహన్ అంత్యక్రియలు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను ఇవాళ ఉదయం 11.45 గంటలకు ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో జరగనున్నాయి. సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది. తొలుత మన్మోహన్ పార్థీవ దేహాన్ని ఆయన నివాసం నుంచి AICC కార్యాలయానికి తరలిస్తారు. అక్కడ ప్రజల సందర్శనార్థం కొద్దిసేపు ఉంచి నిగమ్‌బోధ్ ఘాట్‌కు తీసుకెళ్తారు.