News January 27, 2025
నంద్యాల నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

నంద్యాలలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరగనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా తెలిపారు. సోమవారం పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య ఎంపిక పోటీలు ఉన్నందున సోమవారం జరిగే ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు చెప్పారు. ఈ విషయాన్ని అర్జీదారులు గుర్తించి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రావద్దని సూచించారు.
Similar News
News November 9, 2025
రేపు కలెక్టరేట్‌లో అర్జీలు స్వీకరిస్తాం: కలెక్టర్

పుట్టపర్తి కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదివారం తెలిపారు.
ప్రజలకు జిల్లా అధికారులందరూ అందుబాటులో ఉంటారన్నారు. సమస్యలపై వచ్చే అర్జీదారులు అర్జీలు అందించాలన్నారు. జిల్లాలోని అన్ని మండలాలు, డివిజన్ కేంద్రాలలో ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఆయా పరిధిలో పరిష్కారం కానీ అర్జీదారులు మాత్రమే కలెక్టరేట్‌లో అర్జీలు అందించాలన్నారు.
News November 9, 2025
ఓటుకు రూ.7వేలు ఇస్తున్నారు: బండి సంజయ్

TG: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. అభివృద్ధి కావాలో, అరాచకం కావాలో జూబ్లీహిల్స్ ప్రజలు తేల్చుకోవాలన్నారు. ప్రజలను ప్రలోభ పెట్టేందుకు కాంగ్రెస్ రూ.5వేలు, BRS రూ.7వేలు ఇస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇప్పటికే KCR మెడలను వంచామని, కాంగ్రెస్ మెడలూ BJP వంచుతుందని వ్యాఖ్యానించారు. హిందువుల దమ్మేంటో జూబ్లీహిల్స్ ప్రజలు చూపించాలన్నారు.
News November 9, 2025
SKLM: ‘ఈనెల 11న జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు’

జాతీయ విద్య దినోత్సవ వేడుకలు శ్రీకాకుళం కలెక్టర్ సమావేశ మందిరంలో ఈనెల 11న నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రి, ‘భారత రత్న’ జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138వ జయంతిని పురస్కరించుకుని జరపనున్న కార్యక్రమంలో అధికారులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు.


