News January 27, 2025

శ్రీ సత్యసాయి జిల్లా ఉత్తమ డీఎస్పీగా విజయ్ కుమార్

image

శ్రీ సత్యసాయి జిల్లా ఉత్తమ డీఎస్పీగా విజయ్ కుమార్ ఎంపికయ్యారు. ఆయనకు ఆదివారం పుట్టపర్తిలో జరిగిన గణతంత్ర దినోత్సవం వేడుకల్లో కలెక్టర్ చేతన్ ప్రశంస పత్రాన్ని అందించారు. పుట్టపర్తి సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతలను కాపాడటంలో సఫలత సాధించినందుకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. తన సిబ్బంది ప్రోత్సాహం వల్ల తనకు ఈ గౌరవం దక్కిందని విజయకుమార్ పేర్కొన్నారు. ఇప్పటి నుంచి రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానన్నారు.

Similar News

News November 13, 2025

2047 నాటికి తలసరి ఆదాయం రూ.54 లక్షలు: CM

image

AP: రూ.8.87 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు క్యాబినెట్‌లో అనుమతి ఇచ్చామని, దీని ద్వారా 8 లక్షల ఉద్యోగాలు వస్తాయని CM CBN చెప్పారు. ఇవాళ రూ.2.66 లక్షల కోట్ల పెట్టుబడులకు MoUలు జరిగాయని విశాఖ ఎకనమిక్ రీజియన్ సదస్సులో వెల్లడించారు. సంపద సృష్టి కోసం అందరం జట్టుగా పని చేశామని, 20 లక్షల ఉద్యోగాల హామీని నిరూపించామని పేర్కొన్నారు. 2047 నాటికి తలసరి ఆదాయం రూ.54 లక్షలకు పెంచడమే తమ లక్ష్యమన్నారు.

News November 13, 2025

స్వచ్ఛ ఆంధ్రలో ప్రతి అధికారి పాల్గొనాలి: కలెక్టర్

image

స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల మూడవ శనివారం నాడు నిర్వహించే శుభ్రత కార్యక్రమంలో అధికారులందరూ తప్పనిసరిగా పాల్గొనాలని కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహణ, భవనాలు, లేవుట్ల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై చర్చించారు.

News November 13, 2025

Way2News ఎఫెక్ట్.. రూ.4.5 కోట్ల స్కాంపై ఎంక్వయిరీ

image

కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలో రూ.4.5కోట్ల స్కాం అంటూ <<18192226>>Way2Newsలో కథనం<<>> ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన తెలంగాణ వైద్య విధాన పరిషత్ విచారణ చేపట్టింది. నేడు హాస్పిటల్ చేరుకున్న విచారణ అధికారులు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ విభాగాల్లో క్షేత్రస్థాయిలో నిషితంగా ఆడిట్ నిర్వహిస్తున్నారు. నిధుల దుర్వినియోగం, బిల్స్, రిసిప్ట్‌లపై సంబంధిత సిబ్బందిని ప్రశ్నిస్తూ వివరాలు సేకరిస్తున్నారు.