News January 27, 2025
ఏలూరు: అయ్యో పాపం..!

ఓ చిన్నారి ఎంతో వేదన అనుభవించి చనిపోయాడు. ఈ విషాద ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. మండవల్లి మండలం భైరవపట్నంలో శుక్రవారం రాత్రి గ్యాస్ సిలిండర్లు పేలి 9 గుడిసెలు <<15251500>>దగ్ధమయ్యాయి. <<>>ఈ ఘటనలో దుబ్బా వంశీ, అన్ను కుమారుడు విక్కీ(3) తీవ్రంగా గాయపడ్డాడు. రెండు రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందిన బాలుడు కోలుకోలేక ఆదివారం కన్నుమూశాడు.
Similar News
News November 14, 2025
విశాఖ: 2300 మందితో భద్రత

విశాఖలో జరగనున్న CII భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను, కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌ను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సీపీ శంఖబ్రత బాగ్చి పరిశీలించారు. అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా సుమారు 2300 మంది(8 మంది ఐపీఎస్ అధికారులు, 8మంది ఏడీసీపీలు, 32 మంది ఏసీపీలు, 89 సీఐలు, 192 ఎస్.ఐలు, 2000(ఏ.ఎస్.ఐ,హెచ్.సి,పి.సి, హెచ్.జి)సిబ్బందితో సదస్సుకు పకడ్బందీగా భద్రతా భద్రతా ఏర్పాట్లు చేశారు.
News November 14, 2025
కురుపాం ఘటన.. కేజీహెచ్‌లో NHRC విచారణ

కురుపాం గురుకులంలో జాండిస్ బారిన పడి బాలికలు మృతి చెందిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) బృందం గురువారం కేజీహెచ్‌లో విచారణ చేపట్టింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించింది. ఈ సందర్భంగా కేజీహెచ్ సూపరింటెండెంట్ వైద్య సేవల వివరాలు, పరీక్షల నివేదికలు, తీసుకున్న జాగ్రత్తలు బృందానికి వివరించారు. కాగా నిన్న కురుపాం పాఠశాలను ఈ బృందం సందర్శించింది.
News November 14, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


