News March 18, 2024
ఓదెల: గుండెపోటుతో యువకుడు మృతి

వివాహ వేడుకలో డాన్స్ చేస్తుండగా వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. ఓదెల మండలంలోని కొలనూరు గ్రామంలో స్నేహితుని వివాహ వేడుకల్లో పాల్గొని డాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుతో పడిపోయాడు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు కరీంనగర్ మండలం తీగలగుట్టపల్లి గ్రామానికి చెందిన విజయ్ కుమార్(33)గా గుర్తించారు.
Similar News
News January 27, 2026
KNR: ‘మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తాం’

కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. మంగళవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. మొత్తం 66 డివిజన్లకు 33 ఆర్వో కేంద్రాలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఈనెల 28 నుంచి 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, అభ్యర్థితో పాటు ఇద్దరికే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
News January 27, 2026
KNR: సమస్యాత్మక కేంద్రాల్లో అదనపు బలగాల మోహరింపు

కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 25 నుంచి 30 శాతం పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. ఈ ప్రాంతాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అదనపు బలగాలను మోహరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీస్ శాఖ అన్ని ముందస్తు చర్యలు చేపట్టిందని, ప్రజలు పోలీసులకు సహకరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.
News January 27, 2026
KNR: ఒక కార్పొరేషన్, 3 మున్సిపాలిటీలు, 4,31,722 మంది ఓటర్లు

కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. మొత్తంగా 140 వార్డులకు 450 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 4,31,722 మంది ఓటర్లు ఉన్నారు. కరీంనగర్ కార్పొరేషన్: 66 వార్డులు- 3,40,580 ఓటర్లు, జమ్మికుంట: 30 వార్డులు- 38,120 ఓటర్లు, హుజూరాబాద్: 30 వార్డులు- 36,442 ఓటర్లు, చొప్పదండి:14 వార్డులు-16,580 ఓటర్లు ఉన్నారు. కాగా FEB 11న పోలింగ్, 13న ఫలితాలు వెలువడనున్నాయి.


